ఇడ్లీ కొట్టు.. ధనుష్ మళ్లీ గెలిచేలా..!
ఈ క్రమంలో అతను రాయన్ తో మెప్పించాడు. అంతకుముందు పా పాండి సినిమా చేశాడు. రాయన్ లో తనే లీడ్ రోల్ చేసి సక్సెస్ అందుకున్నాడు.;
కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా ఇడ్లీ కొట్టు ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించారు. సినిమా డైరెక్షన్ లోనే కాదు నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యాడు ధనుష్. ఎలాంటి కథలో అయినా.. ఎలాంటి పాత్రలో అయినా పర్ఫెక్ట్ గా సూటయ్యే యాక్టర్ ధనుష్. అందుకే ఏ పాత్రలో అయినా అతను సరిపోతాడనిపిస్తుంది. ఐతే యాక్టర్ గా డైరెక్టర్స్ రాసిన కథల్లో నటించడమే కాదు అప్పుడప్పుడు తను రాసిన కథలతో కూడా అలరిస్తాడు ధనుష్.
ఇడ్లీ కొట్టు టైటిల్..
ఈ క్రమంలో అతను రాయన్ తో మెప్పించాడు. అంతకుముందు పా పాండి సినిమా చేశాడు. రాయన్ లో తనే లీడ్ రోల్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఇడ్లీ కొడై సినిమా చేశాడు. ఈ సినిమాను ఇడ్లీ కొట్టు అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇడ్లీ కొట్టు తెలుగు రైట్స్ ని రామారావు చింతపల్లి దక్కించుకున్నారు. అక్టోబర్ 1న గ్రాండ్ గా ఇడ్లీ కొట్టు తెలుగు రెండు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుంది.
ఇడ్లీ కొట్టు సినిమా ఆల్రెడీ ట్రైలర్ లో కథ ఏంటన్నది చెప్పేశారు. ధనుష్ మరోసారి ఒక మంచి ఎమోషనల్ రైడ్ తో వస్తున్నాడు. ఇలాంటి కథలు ధనుష్ దగ్గరకే ఎలా వస్తాయన్న ఆలోచన రాక మానదు. ఐతే ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు చూసి సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నారు.
రియలిస్టిక్ ఎమోషనల్ మూవీ..
ఇడ్లీ కొట్టు తెలుగులో కూడా మంచి రిలీజ్ అవుతుంది. ఐతే ఈ సినిమాకు ఇంకాస్త పమోషన్స్ చేసి ఉంటే బాగుండేదన్న టాక్ ఉంది. అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 వస్తుంది. ఆ సినిమాతో పాటు ధనుష్ ఇడ్లీ కొట్టు పోటీ పడుతుంది. ఐతే కాంతారా చాప్టర్ 1 ఒక వెరైటీ సినిమా.. ఇడ్లీ కొట్టు మాత్రం ప్యూర్ రియలిస్టిక్ ఎమోషనల్ మూవీ. మరి ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాకు జివి ప్రకాష్ మ్యూజిక్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతుందని తెలుస్తుంది.
ఇడ్లీ కొట్టు సినిమాను ధనుష్ చాలా లిమిటెడ్ బడ్జెట్ లోనే పూర్తి చేశారని తెలుస్తుంది. సినిమా కథ కూడా చాలా సింపుల్ గా ఉండబోతుంది. కానీ ఎమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వర్క్ అవుట్ అయ్యేలా ఉంటాయని అంటున్నారు. ఈ ఇయర్ ఆల్రెడీ కుబేరతో సక్సెస్ అందుకున్నాడు ధనుష్. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటించిన విషయం తెలిసిందే.