ధనుష్ లో ఆ డైరెక్టర్ ఎక్కడ..?

ఆ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేదు. పోటీగా డ్రాగన్ సినిమా రిలీజ్ అవ్వడంతో ధనుష్ సినిమా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఐతే తన డైరెక్షన్ లో ఇప్పటివరకు 3 సినిమాలు చేసిన ధనుష్.;

Update: 2025-10-02 06:46 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అప్పుడప్పుడు డైరెక్షన్ కూడా చేస్తుంటాడు. ధనుష్ డైరెక్టర్ గా పవర్ పాండి తో తొలి ప్రయత్నం చేశాడు. ఆ సినిమాతో డైరెక్టర్ గా ధనుష్ సర్ ప్రైజ్ చేశాడు. హీరోగానే కాదు డైరెక్టర్ గా కూడా ధనుష్ తన స్పెషాలిటీ చూపించాడని అనుకున్నారు. ఆ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి ధనుష్ రెండేళ్ల క్రితం రాయన్ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా ఎలా ఉన్నా ఓకే అనిపించుకుంది. ఐతే ఆ నెక్స్ట్ జాబిలమ్మ నీకు అంత కోపమా అనే యూత్ ఫుల్ లవ్ స్టోరీతో వచ్చారు.

నాల్గవ సినిమాగా ఇడ్లీ కొట్టు..

ఆ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేదు. పోటీగా డ్రాగన్ సినిమా రిలీజ్ అవ్వడంతో ధనుష్ సినిమా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఐతే తన డైరెక్షన్ లో ఇప్పటివరకు 3 సినిమాలు చేసిన ధనుష్. నాల్గవ సినిమాగా ఇడ్లీ కొట్టు సినిమా చేసింది. అక్టోబర్ 1న రిలీజైన ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. సినిమాలో బలమైన కథ ఉన్నా కూడా దాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను మెప్పించలేదు.

ధనుష్ ఇడ్లీ కదై తెలుగులో ఇడ్లీ కొట్టుగా వచ్చింది. ఇడ్లీ కడై సినిమాను తమిళంలో బాగానే ప్రమోట్ చేశారు. ఐతే సినిమాకు అక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ధనుష్ కథ బాగానే రాసుకున్నా సినిమా చక చకా చుట్టేసినట్టు ఉందన్న భావన ఆడియన్స్ లో ఉంది. తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా చేయాలన్న ఆలోచన బెటరే కానీ ఆడియన్స్ కి ఎంగేజ్ అయ్యేలా సినిమా వస్తుందా అన్న జాగ్రత్త ఉండాల్సిందే.

సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్..

ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమా తెలుగు రిలీజ్ ఐతే అసలేమాత్రం ప్రమోషన్స్ కూడా చేయలేదు. సినిమాకు ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తేనే జనాలు పట్టించుకోవట్లేదు. అలాంటిది అసలు ప్రమోషన్స్ చేయకపోతే ఇక అంతే సంగతులు. ధనుష్ ఇడ్లీ కడై సినిమాను ఒక ఎమోషనల్ రైడ్ గా ఉంటుందని తీశాడు. సినిమాలో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్నా కూడా అది ఆడియన్స్ కి టచ్ చేయలేకపోయింది. అక్కడక్కడ కొన్ని బ్లాక్స్ బాగున్న ఓవరాల్ గా ధనుష్ ఇడ్లీ కొట్టుని ఒక సీరియల్ డ్రామాగా చెప్పుకుంటున్నారు.

మరి ధనుష్ తన డైరెక్షన్ డ్రీం ని పక్కన పెట్టి యాక్టింగ్ మీదే దృష్టి పెడితే బెటర్ అని చెప్పొచ్చు. లేదా పవర్ పాండి లాంటి సినిమా తీసేలా ఉంటేనే డైరెక్షన్ అటెంప్ట్ చేస్తే బెటర్ అని ఆడియన్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News