ధనుష్ ఇలా డిజప్పాయింట్ చేస్తాడనుకోలేదు..!
ఈ సినిమాలో ధనుష్ కి జతగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించింది. ధనుష్ ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.;
కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇడ్లీ కడై. యాక్టర్ గా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తూ వచ్చిన ధనుష్ డైరెక్టర్ గా కూడా కొన్ని వెరైటీ సబ్జెక్ట్ ఎంచుకుని వాటితో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. మామూలుగానే తన కథల ఎంపికల్లో సహజత్వాన్ని చూపించే ధనుష్ తను డైరెక్ట్ చేసే సినిమాల్లో కూడా అదే తరహా కథలను ఎంపిక చేస్తున్నాడు. ఇడ్లీ కొడై సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్ లో ఆకాష్ భాస్కరన్ నిర్మించారు.
ధనుష్ ప్రతి సినిమా తెలుగులో..
ఈ సినిమాలో ధనుష్ కి జతగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించింది. ధనుష్ ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ధనుష్ లాస్ట్ మూవీ కుబేర తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేశాడు. తమిళ ఆడియన్స్ ఆ సినిమాను రిసీవ్ చేసుకోలేదు కానీ తెలుగులో కుబేర ఆకట్టుకుంది. ఐతే ధనుష్ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతున్నా తను ప్రమోషన్స్ మాత్రం లైట్ తీసుకుంటున్నాడు. సార్, కుబేర సినిమాలు తెలుగు దర్శకులు చేశారు కాబట్టి ఇక్కడ అక్కడ ప్రమోషన్స్ చేశాడు ధనుష్.
ఇడ్లీ కొట్టు సినిమాను ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేస్తున్నాడు. ఇది ఓ విధంగా తెలుగు ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది. తెలుగులో ధనుష్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ మార్కెట్ కూడా బాగానే ఉంది. అలాంటిది తన డైరెక్షన్ లో వస్తున్న ఇడ్లీ కొట్టు సినిమాకు ఎందుకు తెలుగులో ప్రమోషన్స్ చేయట్లేదు అన్నది రీజన్స్ తెలియట్లేదు.
అప్పుడు రాయన్.. ఇప్పుడు ఇడ్లీ కొట్టు..
ధనుష్ ఇదివరకు రాయన్ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా కూడా వర్క్ అవుట్ అయ్యింది. జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ యువ నటులతో ఒక సినిమాను డైరెక్ట్ చేశారు. అది కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇడ్లీ కొట్టు సినిమాతో ధనుష్ తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. ఐతే ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.
ఆ ట్రైలర్ కి తగినట్టుగానే తెలుగులో కాస్త కూస్తో ప్రమోషన్స్ చేస్తే బాగుండేది. ఐతే ఓ పక్క థియేటర్ లో ఓజీ సందడి చేస్తుంది. అక్టోబర్ 2 కాంతారా చాప్టర్ 1 కూడా వస్తుంది. ఈ ఫైట్ లో ధనుష్ ఇడ్లీ కొట్టు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ధనుష్ ఇడ్లీ కొట్టు ఆఫ్టర్ రిలీజ్ హంగామా ఏమైనా ఉంటుందా అన్నది చూడాలి. ఐతే ధనుష్ అండ్ టీం మాత్రం ఈ మూవీపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.