• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ జోడీ వర్కౌట్ అవ్వదు.....

ఈ జోడీ వర్కౌట్ అవ్వదు.. ధనుష్ మూవీపై ఫ్యాన్స్ స్ట్రైట్ కామెంట్!

| కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ తాజా ప్రాజెక్ట్ D56 ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే భారీ చర్చకు దారి తీసింది.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2026-04-15 22:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ తాజా ప్రాజెక్ట్ D56 ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే భారీ చర్చకు దారి తీసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్ పేరు వినిపించడంతో సోషల్ మీడియాలో కాస్టింగ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది స‌రైన జోడీ కాద‌నే అభిప్రాయం అభిమానులలో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న హీరోకి సరిపడే మెచ్యూర్ హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ కాంట్రవర్సీకి ప్రధాన కారణంగా నిలుస్తున్న అంశం ఏజ్ గ్యాప్. ధనుష్- సారా అర్జున్ మధ్య 20 ఏళ్లకు పైగా ఏజ్ గ్యాప్ ఉంది. ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో కూడా ఇలాంటి ఏజ్ గ్యాప్ జోడీలపై తీవ్ర చర్చలు జరిగాయి. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న నేపథ్యంలో, ఇలాంటి కాస్టింగ్ ఎంపికలు ఎంతవరకు అంగీకరించబడతాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కథకు అవసరం ఉంటేనే అంగీకరిస్తామనే మైండ్‌సెట్‌తో ఆడియన్స్ ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి.

కోలీవుడ్‌లోనే టాలెంటెడ్ కొత్త హీరోయిన్లు ఉన్నప్పటికీ, బయట నుంచి లేదా పాన్ ఇండియా గుర్తింపు ఉన్న హీరోయిన్ల‌ను ఎంపిక చేయడం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో లోకల్- పాన్ ఇండియా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు తమ ఇండ‌స్ట్రీలోని కొత్త టాలెంట్‌కు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో రుక్మిణి వ‌సంత్ ఎంపిక‌య్యార‌ని వార్త‌లొచ్చాయి కానీ కాల్షీట్ల సమ‌స్య‌ల‌తో ఆమె ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న‌ట్టు స‌మాచారం. రుక్మిణి త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడు సారా అర్జున్ పేరు వినిపించడం వ‌ల్ల ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కు ముందు నుంచే మ‌రింత హైప్ నెలకొంది. మొత్తానికి, ఒక కాస్టింగ్ రూమర్ చుట్టూ ప్రారంభమైన ఈ చర్చ ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీ డిబేట్‌గా మారుతోంది. ఏజ్ గ్యాప్, సరైన జోడీ ఎంపిక, లోకల్ టాలెంట్ ఎంక‌రేజ్‌మెంట్ లాంటి అంశాలు కలిపి D56 సినిమాను హాట్ టాపిక్‌గా నిలిపాయి. ఇన్ని వివాదాల మ‌ధ్య ఈ సినిమాలో ఫైన‌ల్ గా ఎవ‌రిని హీరోయిన్ గా ఎంపిక చేస్తార‌నేది చూడాలి.

Tags:    
  • dhanush 
  • kollywood 
  • d56 
  • saraarjun 
  • d56moviecontroversy 
  • agegapdebate 

Similar News

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

Copyright @2026

Powered by Blink CMS