నటుడు కాకపోతే ధనుష్ మంచి చెఫ్!
సెలబ్రిటీ హోదా...కోట్లాది మంది అభిమానం అందుకోవాలన్నా రాసి పెట్టి ఉండాలి.;
సెలబ్రిటీ హోదా...కోట్లాది మంది అభిమానం అందుకోవాలన్నా రాసి పెట్టి ఉండాలి. అది కొందరికి మాత్ర మే సాధ్యమవుతుంది. అనుకోకుండా ఇండస్ట్రికి వచ్చి స్టార్లు అయిన వాళ్లు ఉన్నారు. స్టార్ అవ్వాలని పరిశ్రమకి వచ్చి తిరిగెళ్లిపోయిన వాళ్లు ఉన్నారు. సక్సెస్ అన్నది కొందరికే. పరిశ్రమకొచ్చి సక్సెస్ అయితే అలాంటి వారందరినీ కారణజన్ములనే చెప్పాలి. కోట్ల రూపాయల సంపాదన...ఖరీదైన జీవితం... స్టేటస్.. అభిమా నం సాధ్యమయ్యేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే.
అందులోనూ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ అయ్యాడంటే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ముందుకు ఓ ఆసక్తికర ప్రశ్న వెళ్లింది. నటుడు అయ్యారు కాబట్టి ఈ స్టేటస్ వచ్చింది. ఒకవేళ నటుడు కాకపోతే మీ జీవితం ఎలా ఉండేదని ప్రశ్నించగా.. మరో ఆలోచన లేకుండా మంచి చెఫ్ గా స్టార్ హోటల్ లో ఉద్యోగం చేసేవాడినన్నారు. చిన్న తనం నుంచి వంట అంటే ఇష్టమట.
వంటల్లో ప్రయోగాలు చేయడం అంటే చెప్పలేనంత ఇష్టమన్నాడు. చిన్నప్పుడు వంటింట్లో అమ్మ పక్కనే ఉండి వంట చేయడం అలవాటు అయిందన్నాడు. వంట విషయంలో తల్లికి మంచి సహాయకుడిగా ఉండేవాడుట. అలా వంట పనిలో బాగా నలిగినట్లు తెలిపాడు. అన్ని రకాల వంటలు చేయడం వచ్చు అట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ప్రయోగాలు చేసి డాడ్ కి రూచి చూపిస్తానన్నాడు.
ఒకవేళ ధనుష్ చెఫ్ అయితే చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయేది. బిర్యానీ చేయడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మాస్టర్. దోశెలు వేడయంలో రామ్ చరణ్ స్పెషలిస్ట్. రుచికరమైన నాన్ వెజ్ వంటకాలు తయారు చేయించడంలో ప్రభాస్ స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే.