స్టార్ హీరో 55 కి కొత్త సమస్య వచ్చిందా?
కోలీవుడ్ స్టార్ ధనుష్ 55వ చిత్రం `అమరన్` ఫేం రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో ప్రారంభమైన అయిన సంగతి తెలిసిందే.;
కోలీవుడ్ స్టార్ ధనుష్ 55వ చిత్రం `అమరన్` ఫేం రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో ప్రారంభమైన అయిన సంగతి తెలిసిందే. `అమరన్` విజయం చూసి ధనుష్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. దీంతో ఈ కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇద్దరు కలిసి మరో దేశభక్తి సినిమా చేస్తున్నారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు బ్రేక్ పడే అవకాశం ఉందన్నది తాజా సమాచా రం. అంతేకాదు డైరెక్టర్ కూడా మారే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. వివరాల్లోకి వెళ్తే తొలుత ఈ చిత్రాన్ని గోపురం ఫిల్మ్స్ నిర్మించడానికి ముందుకొచ్చింది.
చేతులు మారుతోన్న చిత్రం:
కానీ కొన్ని రోజులకే ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవసరమని..ధనుష్ మార్కెట్ కూడా అంతగా లేదని..దీంతో గోపురం ఫిల్మ్స్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంది. అనంతరం ఆ బాధ్యతలు వండర్‌బార్ ఫిల్మ్స్ తీసుకుంది. కానీ గోపురం ఫిల్మ్స్ నిరంభ్యంతర పత్రంలో జాప్యం చేస్తోంది. అంతేకాదు ఈ చిత్రం వండర్ బార్ ఫిల్మ్స్ నుంచి డాన్ పిక్చర్స్ చేతుల్లోకి వెళ్తుంది? అన్నది మరో వార్త. అదే జరిగితే రాజ్ కుమార్ `డి 55` ఛాన్స్ కోల్పోతాడు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డాన్ పిక్చర్స్ లో ఇప్పటికే తమిళ రసన్ ఓ సినిమా పూర్తి చేయాలి.
అభిమానుల కోరిక మాత్రం అతడే:
అదే దర్శకుడికి ధనుష్ తో ఓ కమిట్ ఉంది. ఈనేపథ్యంలో ధనుష్ 55వ చిత్రం చేతులు మారుతుందా? అన్న సందేహాలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కథనాల నేపథ్యంలో అభిమానులు ఖుషీ అవుతున్నారు.`లబ్బర్ పాండు`తో తమిళరసన్ పచ్చముత్తు మంచి కమర్శియల్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కించు కున్నాడు. ధనుష్ తాజా పరిస్థితుల్లో రామ్ కుమార్ కంటే? తమిళరసన్ తోనే చిత్రం చేస్తే బాగుంటుందని, సరైన కమర్శియల్ హిట్ అతడితోనే సాధ్యమవు తుందని అభిప్రాయపడుతున్నారు.
ఎవరికా ఛాన్స్ ఇస్తాడు?
ఈ గ్యాప్ కూడా రాజ్ కుమార్ కి కలి సొస్తుందన్నది వారి అభిప్రాయం. భారీ చిత్రం కాబట్టి స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా మరింత మెరుగులు దిద్దడానికి ఆస్కారం ఉంటుం దంటున్నారు. అయితే ఈ ప్రచారంపై ధనుష్ ఇంత వరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మరి డి 55ని రాజ్ కుమార్ తో ముందుకు తీసుకెళ్తాడా? తమిళరసన్ తీసుకొస్తాడా? అన్నది చూడాలి. ప్రస్తుతం ధనుష్ హీరోగా విఘ్నేష్ రాజా ఓ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ఇది ఆన్ సెట్స్ లో ఉంది. డి 54 టైటిల్ తో రూపొం దుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు డి 55పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.