OTT షోల‌కు ధ‌న‌శ్రీ వ‌ర్మ రైజ్- ఫాల్ చాలా అవ‌స‌రం

వివాదాస్ప‌దులు లేదా జీవితంలో ఎదురు దెబ్బ తిన్న వ్య‌క్తులు రియాలిటీ షోల‌కు కీల‌కం. ఇలాంటి సెల‌బ్రిటీలు మాత్ర‌మే టీఆర్పీల‌ను పెంచ‌గ‌ల‌రు.;

Update: 2025-09-11 17:39 GMT

వివాదాస్ప‌దులు లేదా జీవితంలో ఎదురు దెబ్బ తిన్న వ్య‌క్తులు రియాలిటీ షోల‌కు కీల‌కం. ఇలాంటి సెల‌బ్రిటీలు మాత్ర‌మే టీఆర్పీల‌ను పెంచ‌గ‌ల‌రు. వారి జీవితాలే షోల‌కు గొప్ప‌ ముడిస‌రుకు. అలాంటి వివాదాస్ప‌ద వ్య‌క్తులు లేదా జీవితంలో పెద్ద ఘ‌ట‌న‌తో దెబ్బ తిన్న వారిపై ప్ర‌జ‌ల ఫోక‌స్ ని ఎన్ క్యాష్ చేసుకోవ‌డానికి రియాలిటీ షోల నిర్వాహ‌కుల ఎత్తుగ‌డ‌లు మ‌హ‌దాద్భుతం. వీళ్ల బుర్ర‌ల్లోని ఐడియాల‌కు శ‌త‌కోటి వంద‌నాలు. ఇలాంటి మ‌హా మేధో రియాలిటీ షోలు దేశానికి, దేశంలోని ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రం.

ఎవ‌రు ఏం చేసినా ప్ర‌జ‌ల‌కు వినోదం పంచ‌డం చాలా ముఖ్యం. ప్ర‌జ‌ల ఫోక‌స్ ఎలాంటి వివాదాస్ప‌దులు లేదా విధివంచిత‌ల‌పై ఉందో ప‌సిగ‌ట్టి, వారిని ఒక చోట పోగేసి తెర‌మీద పందేరం వేయ‌డం ముఖ్యం. బిగ్ బాస్ షో థీమ్ ఎప్పుడూ దీనికి అతీతం కాదు. ఇప్పుడు అష్నీర్ గ్రోవర్ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్ కొంచెం అటూ ఇటూగానే ఇలాంటి థీమ్ తోనే కొంత వెరైటీ స్క్రిప్టుతో ముందుకు సాగుతోంది.

భ‌ర్త చాహ‌ల్ నుంచి విడిపోయిన ధ‌న‌శ్రీ వ‌ర్మ‌పై ప్ర‌జ‌లకు చాలా ఆస‌క్తి ఉంది. అందుకే `రైజ్ అండ్ ఫాల్` షోలో పార్టిసిపెంట్ గా ధ‌న‌శ్రీ‌కి జాక్ పాట్ త‌గిలింది. ఈ వేదిక మీద ప్ర‌జ‌లు ఏం చూడాల‌నుకుంటున్నారంటే భార్య భ‌ర్త‌ల త‌గాదాను లేదా విడాకుల ప్రాసెస్ ఎలా జ‌రిగిందో తెలుసుకోవాల‌నుకుంటున్నారు. గత వారం ఈ షో ప్రీమియర్ అయినప్పటి నుండి, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ నుండి తన హై ప్రొఫైల్ విడాకుల గురించి ధనశ్రీ మరిన్ని వివరాలను వెల్లడిస్తుందా అని అందరూ ఎదురుచూసారు. షోలో ధ‌న‌శ్రీ‌ కదలికల‌ను అంద‌రూ ప‌రిశీలిస్తున్నారు. త‌న జీవితంలో ఆ ఉద్విగ్న ఘ‌ట‌న కార‌ణంగా, తనను తాను కూడా ఎగతాళి చేసుకునే అవకాశాలను ధ‌న‌శ్రీ‌ వదులుకోవడం లేదు. తద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. `రైజ్ అండ్ ఫాల్‌`షోలో ధనశ్రీ వర్మ ఎక్కువగా చర్చించబడే పోటీదారుగా మారింది.

రైజ్ అండ్ ఫాల్‌లో పోటీదారులతో ధ‌న‌శ్రీ ఘ‌ర్ష‌ణ ఆస‌క్తిక‌రం. విడాకుల సంగ‌తి ఎలా ఉన్నా కానీ కెరీర్ ప‌రంగా ఎద‌గాలంటే మెరిట్, హార్డ్ వ‌ర్క్ చాలా ముఖ్య‌మ‌ని ఆమె పేర్కొంది. క‌ల‌త చెందినా కానీ త‌న‌కు అభిమానుల అండ ఉంది. ఇక ధ‌న‌శ్రీ వాస్త‌వంగా విడాకుల స‌మ‌యంలో చాలా ఆవేద‌న‌కు గురైన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. వాట‌న్నిటిపైనా షోలో చెబుతుందేమో చూడ‌టానికి ఫ్యాన్స్ వెయిటింగ్. విడాకుల త‌ర్వాతే త‌న కెరీర్ రంజుగా సాగ‌డానికి కార‌ణాల‌ను కూడా చెబుతుందేమో జ‌స్ట్ వెయిట్!!

Tags:    

Similar News