• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డెవిల్ స్టన్నింగ్ 'లేడీ...

డెవిల్ స్టన్నింగ్ 'లేడీ రోజ్'

| బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ సక్సెస్ అందుకున్న ఈ నందమూరి హీరో ఇప్పుడు అంతకుమించి ఎనర్జీ తో మరో సినిమాతో వైబ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

By - Tupaki Desk
Update: 2023-11-27 09:08 GMT

నందమూరి కళ్యాణ్‌రామ్ తన కెరీర్ మొదటి నుండి విభిన్నమైన స్క్రిప్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ సక్సెస్ అందుకున్న ఈ నందమూరి హీరో ఇప్పుడు అంతకుమించి ఎనర్జీ తో మరో సినిమాతో వైబ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.


ఇక అతని నుంచి నెక్స్ట్ రాబోతున్న డిఫరెంట్ మూవీ డెవిల్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. ఈ చిత్రానికి అభిషేక్ నామా నిర్మించడమే కాకుండా దర్శకత్వం బాధ్యతలు కూడా తీసుకున్నారు.

ఇక ఈ సినిమా టీజర్ ను ఇదివరకే విడుదల చేయగా మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక మొదటి సింగిల్, మ్యాజికల్ మెలోడీగా వచ్చిన విషయం తెలిసిందే. అది కూడా ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు, మేకర్స్ రెండవ సింగిల్ "దిస్ ఈజ్ లేడీ రోజ్" లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. పోస్టర్స్ తోనే ఈ సాంగ్ పై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశారు.

ఇటీవల గ్లోబల్ హిట్ గా నిలిచిన జవాన్ థీమ్‌ను పాడిన టాప్ సింగర్ రాజకుమారి ఈ సాంగ్ ను ఆలపించారు. ఆమె మరోసారి తన గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తూ పాటకు విజువల్స్ పరంగా మరింత గ్లామర్‌ని జోడించారు అని చెప్పవచ్చు. రాజా కుమారి పాడిన ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచగా, శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు.

ఇక బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ మెరిసే ఈ పాటలో సిల్క్ మినీ డ్రెస్‌లో హైలెట్ గా నిలిచింది. ఆమె గ్లామరస్ బ్యూటీగా అదిరిపోయే డ్యాన్స్‌లో హైటెక్కిచింది. ఇందులో నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా తన వైట్ సూట్‌లో డాపర్ అవతార్‌లో కనిపించాడు. ప్రేక్షకులను ఆకర్షించేలా రూపొందించిన ఈ లిరికల్ వీడియో చూస్తుంటే సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతుంది అనిపిస్తుంది..

సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మరోసారి తన టాలెంట్ ఏమిటో చూపించాడు. లిరికల్ వీడియోలో ఎల్నాజ్ హాట్ మూమెంట్స్ తో సాంగ్ కు సంబంధించిన మేకింగ్ షాట్‌ల విజువల్స్ హైలెట్ అయ్యాయి. ఈ పాట తప్పకుండా థియేటర్లలో కన్నుల పండువగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక అభిషేక్ పిక్చర్స్ అద్భుతమైన నిర్మాణ విలువలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది. ఇక సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.

Full View
Tags:    
  • Devil 
  • Kalyanram 
  • Samyukthamenon 
  • Abhisheknama 

Similar News

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

Copyright @2026

Powered by Blink CMS