దేవ‌ర‌2 పై ర‌త్న‌వేలు షాకింగ్ కామెంట్స్.. అస‌లు సినిమా ఉందా లేదా?

తాను ప్ర‌స్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాన‌ని, దేవ‌ర‌2 గురించి ఇప్ప‌టికైతే త‌న‌కేమీ తెలియ‌ద‌ని ఆయ‌న చెప్ప‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనుమానాల‌కు దారి తీస్తోంది.

Update: 2026-05-21 07:24 GMT

టాలీవుడ్‌లో అత్యంత భారీ అంచనాలు ఉన్న సీక్వెల్స్‌లో దేవ‌ర‌2 ఒక‌టి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో వచ్చిన దేవర మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ క్రియేట్ చేయడంతో రెండో భాగంపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. కానీ తాజాగా సినిమాటోగ్రాఫర్ R. ర‌త్న‌వేలు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీశాయి.

తాను ప్ర‌స్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాన‌ని, దేవ‌ర‌2 గురించి ఇప్ప‌టికైతే త‌న‌కేమీ తెలియ‌ద‌ని ఆయ‌న చెప్ప‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనుమానాల‌కు దారి తీస్తోంది. రత్నవేలు చేసిన వ్యాఖ్యల్లో మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. రంగస్థలం నుంచి తాను చేస్తున్న సినిమాలన్నీ పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉన్నాయ‌ని, ఇకపై పీరియడ్ సినిమాలు చేయకూడదనుకుంటున్నాన‌ని, జానర్ ఏదైనా సరే ముందు తాను కథలో ఎమోషన్ చూస్తాన‌ని, సైన్స్ ఫిక్షన్ సినిమా అయినా అందులో ఎమోష‌న్ వెతుక్కుంటాన‌ని ఆయన చెప్పడం వైరల్ అయింది.

ర‌త్న‌వేలు ప‌ని చేసిన పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో చిత్ర ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్నారు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగానే ర‌త్న‌వేలు ఈ కామెంట్స్ ను చేశారు. అయితే దేవ‌ర2 గురించి ర‌త్న‌వేలు చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో ప‌లు సందేహాల‌ను రేకెత్తిస్తున్నాయి. దేవ‌ర‌2 గురించి త‌న‌కేమీ తెలియ‌దంటే అస‌లు ఈ సినిమా ఉందా లేక అస‌లు ఆ సినిమా ఉండ‌దా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

మ‌రోవైపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర2 నుంచి అప్డేట్ వ‌స్తుంద‌ని ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూశారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక పోస్టర్, కాన్సెప్ట్ వీడియో లేదా చిన్న హింట్ కూడా రాకపోవడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో కూడా అసలు దేవర 2 ఉంటుందా? లేక కొర‌టాల పూర్తిగా బాల‌య్య సినిమాపైనే ఫోక‌స్ చేస్తూ, ఈ సినిమాను తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టారా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇండస్ట్రీ వర్గాలు మాత్రం దేవర1 క్లైమాక్స్ ను రెండో భాగానికి స్ట్రాంగ్ బేస్‌గా రూపొందించారని, కాబట్టి ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయే అవకాశాలు తక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఈ అనుమానాలు తగ్గేలా కనిపించడం లేదు.

Tags:    

Similar News