తార‌క్ మొండి నిర్ణ‌యం గ్రేట్ అనిపించేలా!

తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-కొర‌టాల శివ విష‌యంలో ఇదే స‌న్నివేశం క‌నిపిస్తోంది.;

Update: 2026-01-28 07:30 GMT

ఓ పాన్ ఇండియా స్టార్ కి రెండ‌వ సినిమా రూపంలో డివైడ్ టాక్ ఎదురైందంటే? అదే ద‌ర్శ‌కుడితో మ‌రో సినిమా చేయడానికి ఎంత మాత్రం సాహ‌సించ‌డు. అందులోనూ ప్రాంచైజీలో కొన‌సాగే అవ‌కాశం అస‌లే ఉండ‌దు. మ‌రో ప్లాప్ ఇస్తే ప‌రిస్థితి ఏంటి? అన్న భ‌యం..ఆందోళ‌న వెంటాడుతుంది. ఎంత స్నేహితుడైనా..బాగా ప‌రిచ‌య‌స్తున్న‌డైనా? నిర్ణ‌యం తీసుకునే ముందు మాన‌సికంగా ఎంతో న‌లిగిపోవాల్సి ఉంటుంది. క‌థ‌ను, ద‌ర్శ‌కుడిని ఎంతో బ‌లంగా న‌మ్మితే త‌ప్ప ఆ కాంబినేష‌న్ రిపీట్ అవ్వ‌డం అన్న‌ది జ‌ర‌గ‌దు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-కొర‌టాల శివ విష‌యంలో ఇదే స‌న్నివేశం క‌నిపిస్తోంది.

ఇద్ద‌రి కాంబినేష‌న్ లో పాన్ ఇండియాలో రిలీజ్ అయిన `దేవ‌ర` ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. రెండు భాగాలుగా మొద‌లైన ప్రాజెక్ట్ మొద‌టి భాగానికి డివైడ్ టాక్ రావ‌డంతో? రెండ‌వ భాగం ఉంటుందా? ఉండ‌దా? అన్న దానిపై ఎన్నో సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఉంటుందని తార‌క్.. కొర‌టాల ఎంత బ‌లంగా చెప్పినా జ‌నాలు న‌మ్మ‌లేదు. కోర‌టాల‌కు ఊర‌ట‌నివ్వ‌డం కోసం తార‌క్ అలా మాట్లాడుతున్నాడు...తార‌క్ కోసం కొర‌టాల కొంత కాలంగా సైలైంట్ గా ఉన్నాడ‌ని ఇలా తోచిన క‌థ‌నాలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి.

డివైడ్ టాక్ వ‌చ్చిన సినిమాకు పార్ట్ 2 చేసేంత అమాయ‌క‌త్వంతో తార‌క్ ఉన్నాడా? అని ఎన్నో నోళ్లు విమ‌ర్శించాయి. దీంతో `దేవ‌ర 2` ఉండ‌ద‌నుకున్నారంతా. కానీ ఆ చిత్ర నిర్మాత మాత్రం మే నుంచి `దేవ‌ర 2` మొద‌లు పెడుతున్న‌ట్ల అధికారికంగా వెల్ల‌డించ‌డంతో విమ‌ర్శ‌కుల‌కు మ‌బ్బులు విడిపోయింది. ఎన్టీఆర్ -కొర‌టాల ఇంత కాలం చెప్పిందంతా వాస్త‌వ‌మేన‌ని ఇప్పుడైనా ధృవీక‌రించాల్సిందే. ఈ విష‌యంలో తార‌క్-కొర‌టాల చాలా మొండిగా ఉన్నారు. అంత‌కు మించి ఎంతో కాన్పిడెంట్ గా క‌నిపిస్తున్నారు. అస‌లైన క‌థ పార్ట్ 2 లో ఉంటుంద‌ని నిర్మాత కూడా టోన్ పెంచి చెప్పే ప్ర‌య‌త్నం చేసారు.

ప్ర‌త్యేకించి తార‌క్ ను మెచ్చుకోవాలి. డివైడ్ టాక్ వ‌చ్చిన కంటెంట్ కి రెండ‌వ భాగం ఇంత దూరం వ‌చ్చిందంటే? కార‌ణం తార‌క్ బ‌లంగా ఉండ‌ట‌మే. అత‌డు క‌థ‌ను, ద‌ర్శ‌కుడిని బ‌లంగా న‌మ్మ‌డంతోనే ఇదంతా సాధ్య‌మ‌వుతుంది. ఇండ‌స్ట్రీలో ఎంతో మంది స‌క్సెస్ పుల్ ద‌ర్శ‌కులున్నారు. కొర‌టాల కాక‌పోతే తార‌క్ తో సినిమా తీయ‌డానికి క్యూలో ఎంతో మంది ఉన్నారు. కానీ కొర‌టాల‌తో ముందుకెళ్తున్నాడంటే? అత‌డిపై వ్య‌క్తిగ‌త అభిమాన‌మే కాదు. అంత‌కు మించి స్రిప్ట్ ను బ‌లంగా నమ్మిన హీరో కాబ‌ట్టే సాద్య‌మ‌వుతుంది. మ‌రో రెండు నెల‌ల్లో తార‌క్ ప్ర‌శాంత్ నీల్ సినిమా షూటింగ్ నుంచి రిలీవ్ అవుతాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆ సినిమా చిత్రీక‌ర‌ణ క్లైమాక్స్ కు చేరుకుంది.

Tags:    

Similar News