దేవర 2కి సిద్ధంకండి అంటున్న మేకర్స్.. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారా?

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తో కలిసి చేసిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ అందుకుంది.;

Update: 2025-09-27 08:08 GMT

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తో కలిసి చేసిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ అందుకుంది. అంతేకాదు ఆస్కార్ వేడుకల్లో కూడా సందడి చేసి.. ఆస్కార్ అవార్డులను కూడా దక్కించుకుంది. అలాంటి ఈ చిత్రంపై హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ వంటి వారు కూడా ప్రశంసలు కురిపించారు. అంతలా తన నటనతో భారీ ఇమేజ్ దక్కించుకున్నారు ఎన్టీఆర్. దీంతో ఈ సినిమా తర్వాత ఆయన చేసిన మరో చిత్రం దేవర. రాజమౌళి మూవీ తర్వాత చేసిన సినిమా కావడం.. పైగా కొరటాల శివతో ఇదివరకే జనతా గ్యారేజ్ సినిమా చేసి హిట్ కొట్టడంతో.. ఈ సినిమాపై అభిమానులలో అంచనాలు భారీగా ఉండేవి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ విడుదలయ్యింది.


కానీ అభిమానుల అంచనాలను ఏమాత్రం ఈ సినిమా రీచ్ అవ్వలేదని చెప్పాలి. అలా ఆర్ఆర్ఆర్ రిజల్ట్ , ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా రూ. 500 కోట్లు వసూలు చేసి నెట్టుకు వచ్చింది. అయితే అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ అంటూ అప్పట్లోనే మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానుల నుండి కూడా వ్యతిరేకత నెలకొంది. దేవర సినిమా అంతంతమాత్రంగానే ఉంది అంటే.. ఇక దానికి సీక్వెల్ ఎవరు చూస్తారు? అసలు సీక్వెల్ చేసే అంత కంటెంట్ దేవర సినిమాలో ఏముంది ? అంటూ పలువురు తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఈసారి మాత్రం పుష్ప2 రేంజ్ లో దేవర 2 ఉంటుంది అంటూ మేకర్స్ తెలిపారు.

కానీ ఆడియన్స్ లో మాత్రం ఈ సినిమాపై అంచనాలు లేవనే చెప్పాలి. దీనికి తోడు దేవర సినిమా విడుదలై నేటికి సరిగ్గా ఏడాది అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ దేవర 2 పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. దేవర 2 త్వరలో సిద్ధం కాబోతోంది.. మీరు కూడా సిద్ధంకండి అంటూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ పోస్ట్ అయితే పెట్టారు కానీ దేవర 2 అభిమానుల అంచనాలను రీచ్ అవుతుందా? అసలే అభిమానులలో ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు.. ఇలాంటి సమయంలో వరుస అప్డేట్లు సినిమాపై బజ్ పెంచేస్తాయని అనుకుంటున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి ప్రస్తుతం ఆడియన్స్ లో ఉన్న అంచనాలు మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ మూవీ పైనే అని చెప్పాలి. నిజానికి గతంలో వార్ 2 సినిమాపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న అభిమానులకు ఎన్టీఆర్ నిరాశ మిగిల్చారు. పైగా ఆయన బాలీవుడ్ తొలి చిత్రం కూడా ఇదే అయినా.. అక్కడ ఆయనకు ఈ సినిమాతో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఇప్పుడు అందరి అంచనాలు డ్రాగన్ పైనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మేకర్స్ దేవర 2 ఉంది అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారే కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమాను పట్టించుకోలేదని చెప్పాలి. ఒకవేళ ఈ సినిమా తీసినా కూడా నిర్మాతలకు ప్రయోజనం ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి చూద్దాం మునుముందు ఈ దేవర 2 పై అంచనాలు క్రియేట్ చేయడానికి మేకర్స్ ఏ రేంజ్ లో కష్టపడతారో..

Tags:    

Similar News