దేవర 2 నుంచి మరో ట్విస్ట్..!
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సక్సెస్ అవ్వగా నెక్స్ట్ ఆచార్య తర్వాత ఫ్లాపులో ఉన్న డైరెక్టర్ కి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు తారక్.;
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సక్సెస్ అవ్వగా నెక్స్ట్ ఆచార్య తర్వాత ఫ్లాపులో ఉన్న డైరెక్టర్ కి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు తారక్. కొరటాల శివ కూడా పాన్ ఇండియా లెవెల్ లో దేవర అంటూ ఒక మూవీ తీశాడు. దేవర పార్ట్ 1 లాస్ట్ ఇయర్ రిలీజైంది. సినిమాపై ఉన్న అంచనాలను అది రీచ్ కాలేదని చెప్పాలి. ఐతే దేవర 2 విషయంలో కూడా ఆడియన్స్ కి అంత ఆసక్తి లేదు. దేవర 1 లో చాలా ప్రశ్నలు చిక్కుముడులు ఉన్నాయి. వాటన్నిటికీ దేవర 2లోనే ఆన్సర్స్ ఉన్నాయి.
దేవర 2 మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్..
ఐతే దేవర 2 దాదాపు ఆగిపోయినట్టే అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ గా చెప్పలేదు కానీ దాదాపు అందరు దేవర 2 ఆగిపోయినట్టే అని ఫిక్స్ అయ్యారు. దేవర 2 విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలాఉంటే కొరటాల శివ వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి. ఐతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దేవర 2 ఆగిపోలేదని చెబుతున్నారు.
కొరటాల శివ దేవర 2 కి టైం ఉందని ఈలోగా మరో సినిమా చేసుకుంటే బెటర్ అని ఆలోచించారట. ఎన్టీఆర్ కూడా దానికి ఓకే చెప్పారట. ఐతే కొరటాల శివతో సినిమా చేసే హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. స్టార్స్ అంతా తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ హీరోతో కొరటాల శివ కలిసి పనిచేయాలి. సో అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి.
దేవర 2 ఎలాగైనా చేయాలనే ఆలోచనలో..
ఐతే కొరటాల శివ దేవర 2 కథ దాదాపు ఫైనల్ చేశారట. తారక్ కూడా దేవర 2 ఎలాగైనా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. దేవర 1ని మర్చిపోయేలా దేవర 2 కంప్లీట్ గా కొత్త సెటప్ తో అదిరిపోయే టర్న్, ట్విస్ట్ లతో ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ. అలా అయితే దేవర 2 కచ్చితంగా మళ్లీ బజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దేవర 2 ఉంటుందా లేదా ఈ ప్రశ్న దాదాపు ఆరు నెలల నుంచి చర్చల్లో ఉంది.
నిన్న మొన్నటిదాకా దేవర 2 అటకెక్కేసిందన్న వార్తలు రాగా మళ్లీ ఇప్పుడు దేవర 2 కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. మరి ఎన్ టీ ఆర్, కొరటాల శివ దేవర 2 ఏం చేస్తారో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ కన్ ఫ్యూజన్ తో పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం, నెల్సన్ రెడీగా ఉన్నారు.
దేవర 2 చేయాలని అనుకున్నా కచ్చితంగా మరో ఏడాది తర్వాతే అది సెట్స్ మీదకు వెళ్తుంది. ఈలోగా దేవర 1 మీద ఉన్న నెగిటివిటీ పోయి కొత్తగా దేవర 2 ని ప్రమోట్ చేసే ప్లాన్ చేస్తున్నారు. మరి దేవర 2 పై ఈ డిస్కషన్ రోజుకొక ట్విస్ట్ తీసుకుంటుంది. ఐతే సినిమా ఉన్నా లేకపోయినా అఫీషియల్ గా ఒక మాట చెప్పేస్తే బెటర్ అని ఆడియన్స్ భావిస్తున్నారు.