• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్ర‌గ్స్ మ‌త్తులో...

డ్ర‌గ్స్ మ‌త్తులో దీపిక‌..రిస్క్ తీసుకుంటుందా!

| సీన్ ర‌క్తిక‌ట్టిం చ‌డంమే న‌టి బాధ్య‌త అంటూ ఆ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి ఓదిగిపోతుంది.

By - Tupaki Desk
Update: 2023-12-19 15:30 GMT

వెండి తెర‌పై దీపికా ప‌దుకొణే చేయ‌ని సాహ‌సం అంటూ ఉండ‌దు. స‌న్నివేశం డిమాండ్ చేసిందంటే? పూర్తిగా ద‌ర్శ‌కుల హీరోయిన్ అయిపోతుంది. ఎలాంటి స‌న్నివేశాల‌కు అడ్డు చెప్ప‌దు. సీన్ ర‌క్తిక‌ట్టిం చ‌డంమే న‌టి బాధ్య‌త అంటూ ఆ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి ఓదిగిపోతుంది. అందుకే అంత గొప్ప న‌టి కాగ‌లిగింది. ఐశ్వ‌ర్యారాయ్ త‌ర్వాత అంత‌టి పాపులారిటీని ద‌క్కించుకుంది.

క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తూనే మ‌రోవైపు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తోనూ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతోంది. తాజాగా ఈ బ్యూటీ మ‌రోసారి వెబ్ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెడుతుంది. ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ కి సంతంకం చేసింది. భార‌త్ లోని డ్ర‌గ్ మాఫియా నేప‌థ్యంలో ఈసిరీస్ తెర‌కెక్క‌నుంది. ఈ మెగా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని నెట్ ప్లిక్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఈ సిరీస్ కోసం భారీ బ‌డ్జెట్ కేటాయిస్తుందిట‌.

ఇందులో పోరాట స‌న్నివేశాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది. ఈనేప‌థ్యంలో దీపిక అన్ని ర‌కాలుగా సిద్ద‌మ‌వ్వాల్సి ఉంటుందని...యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం విదేశాల్లో కొంత శిక్ష‌ణ అవ‌స‌రమ‌ని మేక‌ర్స్ భావి స్తున్నారుట‌. ఈ నేప‌థ్యంలో రెండు నెల‌ల పాటు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇప్పించాల‌ని స‌న్నాహాలు చేస్తు న్నారుట‌. ఇందులో దీపిక హ‌ద్దులు చెరిపేసి న‌టించాల్సి ఉంటుందిట‌. తెర‌పై కొత్త దీపిక‌ని ఆవిష్క‌రించేలా సిరిస్ ఉండ‌బోతుందిట‌.

అయితే ఈ వెబ్ సిరీస్ కి దీపికా ప‌దుకొణే ఇంకా డేట్లు కేటాయించ‌లేదుట‌. ఆమె డేట్టు కేటాయించ‌డాన్ని బ‌ట్టీ శిక్ష‌ణ‌కు సంబంధించి..చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించి షెడ్యూల్స్ వేయాల్సి ఉంటుంద‌ని నెట్ ప్లిక్స్ భావిస్తుందిట‌. అయితే ఈ సిరీస్ కి ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు? అన్న‌ది కూడా క్లారిటీ రాలేదు. ప్ర‌స్తుతం దీపికా ప‌దుకొణే సిద్దార్ధ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్` లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే దీపిక ప‌దుకొణే `గెహ్రాయాన్` అనే వెబ్ సిరీస్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్ ఎంత మంచి పేరు తెచ్చిందో అంత‌కు మించి విమ‌ర్శ‌లు తెచ్చి పెట్టింది.

Tags:    
  • Deepikapadukone 
  • Aishwaryarai 
  • Netflix 
  • Webseries 
  • Drugmafia 
  • India 

Similar News

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

Copyright @2026

Powered by Blink CMS