ప్యాన్ వార్ తో హీరోయిన్లు కూడా తిట్టుకున్నారా?
హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి వైరాలు సహజం. అవి చినిగి చినిగి గాలి వానాల మారితేనే సన్నివేశం సీరియస్ అవుతుంది.;
హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి వైరాలు సహజం. అవి చినిగి చినిగి గాలి వానాల మారితేనే సన్నివేశం సీరియస్ అవుతుంది. స్టార్ హీరోల సరసన నటించే విషయంలోనూ..అవకాశాల కోసం పోటీ పడే సమయంలోనూ ఇలాంటి క్లాషెస్ వస్తుంటాయి. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది. స్నేహితులు కూడా బద్దశత్రువుల్లా మారుతుంటారు. మళ్లీ ఆ పొరపొచ్చాలు తొలగిపోవడానికి కొంత సమయం పడు తుంది. కానీ ఈ మధ్యలో ప్యాన్ వార్లు కూడా నెట్టింట సంచలనమవుతుంటాయి.
ఇండస్ట్రీలో హెల్దీ వాతావరణం:
ఇవి ఇంకా ప్రమాద రకమైనవి. లేని వివాదాలు కూడా ఇలాంటి వార్లు కారణంగా అప్పుడప్పుడు తెరపైకి వస్తుంటాయి. తాజాగా అలాంటి వివాదం ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. దీపికా పదుకొణే-అలియాభట్ మధ్య వృత్తిపరంగా చాలా కాలంగా పోటీ ఉంది. దీన్ని వార్ సవాల్ గానే స్వీకరిస్తారు. నటిగా ఎవరికి వారే బెస్ట్ అంటూ ముందు కెళ్తుంటారు. ఇదంతా ప్రోఫెషనల్ గా సాగే యుద్దం. దాన్ని వారు ఎంత మాత్రం పట్టించుకోరు. వ్యక్తిగతంగా ఇద్దరు మంచి స్నేహితులు కూడా. అయితే ఇద్దరి మద్య లివీస్ బ్రాండ్ ఇప్పుడు చిచ్చి పెట్టినట్లు కనిపిస్తోంది.
భగ్గుమన్న సోషల్ మీడియా:
ప్రఖ్యాత అమెరికా దుస్తలు బ్రాండ్ లివీస్ కు దీపికా పదుకొణే చాలా కాలంగా బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తోంది. అయితే తాజాగా దీపిక తప్పుకోవడంతో ఆబాధ్యతలు అలియాభట్ తీసుకుంది. ఈ విషయం బయటకు రావడంతో దీపిక అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. దీపికను ఏ కారణంగా తప్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అగ్రిమెంట్ ఉన్నా? తప్పించడానికి గల కారణాలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా అలియాభట్ ని కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
అలియాభట్ టంగ్ స్లిప్ :
దీంతో అలియా అభిమాన వర్గం కూడా కౌంటర్ ఎటాక్ కి దిగింది. ఇది ఏ స్థాయికి చేరిందంటే? ఏకంగా విషయం దీపికా పదుకొణే- అలియాభట్ భట్ లకు చేరింది. దీంతో దీపిక సోషల్ మీడియాలో జరుగుతోన్న యుద్దాన్ని అభిమానులు ఆపాలని కోరిందిట. అలియాభట్ కూడా తన అభిమానుల్ని రిక్వెస్ట్ చేసిందిట. కానీ అలియాభట్ తన అభిమానులకు బధులు దీపిక అభిమానులు వెనక్కి తగ్గాలని కోరిందిట. దీంతో దీపికా పదుకొణే అలియాభట్ కి ఫోన్ చేసి ఇదేం న్యాయమంటూ అడిగిందిట. ప్రతీగా అలియాభట్ కూడా కాస్త సీరియస్ గానే సమాధానం ఇచ్చిందని బాలీవుడ్ మీడియా ఓ కథనంలో పేర్కొంది.