మళ్లీ కన్నెత్తి చూడని దీపిక పదుకొణే- రష్మిక!
బెంగుళూరు నుంచి బాలీవుడ్ కి వెళ్లి సక్సస్ అయిన బామలెంత మంది? అంటే ట్రెండింగ్ లో ఉన్న ఇద్దరు భామల పేర్లు ప్రముఖంగా తెరపైకి వస్తాయి.;
బెంగుళూరు నుంచి బాలీవుడ్ కి వెళ్లి సక్సస్ అయిన బామలెంత మంది? అంటే ట్రెండింగ్ లో ఉన్న ఇద్దరు భామల పేర్లు ప్రముఖంగా తెరపైకి వస్తాయి. వారే దీపికా పదుకొణే...రష్మికా మందన్నా? ఇద్దరు కర్ణాటక ప్రాంత నుంచి వెళ్లిన వారే. తొలుత ఇద్దరి జర్నీ కన్నడ పరిశ్రమలోనే ప్రారంభమైంది. సరిగ్గా రెండున్నర దశాబ్దాల క్రితం దీపకా పదుకొణే `ఐశ్వర్య` అనే కన్నడ చిత్రంతోనే తెరంగేట్రం చేసింది. అటుపై ఏడాది గ్యాప్ లోనే బాలీవుడ్ చిత్రం `ఓంశాంతి ఓం`లో ఛాన్స్ అందుకుంది. షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో దీపిక హీరోయిన్ గా నటించగా పర్హాన్ అక్తర్ తెరకెక్కించారు.
దీపిక కెరీర్ కు భిన్నంగా:
ఈ ఒక్క విజయం దీపిక జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేసింది. 40 కోట్ల బడ్జెట్ సినిమా 150 కోట్లు వసూళ్లు సాధించడంతో? దీపిక కెరీర్ బాలీవుడ్ లో సెట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలతో మంచి విజయాలు అందుకుంది. అదే సమయంలో షారుక్ ఖాన్ సెంటిమెంట్ హీరోయిన్ గానూ మారిపోయింది. అప్పటి నుంచి దీపిక బాలీవుడ్ లో స్టార్ లీగ్ లో చేరడానికి పెద్దగా సమయం పట్టలేదు. `కిరిక్ పార్టీ`తో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన రష్మికా మందన్నా కెరీర్ మాత్రం అందుకు భిన్నం.
రష్మిక సక్సెస్ అక్కడ అలా:
కన్నడ సినిమాల సక్సెస్ అనంతరం `ఛలో` తో టాలీవుడ్ లో లాంచ్ అవ్వడం ఆ సినిమా సక్సస్ అవ్వడంతో? టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి పెద్దగా సమయం పట్టలేదు. అమ్మడి అందం, అభినయం, స్పార్క్ నచ్చడంతో అవకాశాలతో బిజీ అయింది. తెలుగులో స్టార్ హీరోలందరితో పనిచేసి `పుష్ప`తో పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. అటుపై `యానిమల్` తో బాలీవుడ్ లో లాంచ్ అవ్వడం..అది హిట్ అవ్వడం...అక్కడా బిజీ అవ్వడం అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. కానీ దీపిక, రష్మిక లిద్దరు మళ్లీ కన్నెత్తి సొంత పరిశ్రమ వైపు చూడలేదు అన్నది అంతే వాస్తవం.
దీపికా పదుకొణే సేఫ్ జోన్ లో:
హీరోయిన్లగా పాన్ ఇండియాలో ఎంతో గుర్తింపు వచ్చినా? కన్నడ సినిమాలు మాత్రం చేయలేదు. తెలుగులో సక్సెస్ అయిన అనంతరం రష్మికకు సొంత పరిశ్రమలో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ వేటికి ఒకే చెప్పలేదు. చివరికి సొంత పరిశ్రమ నుంచి గౌరవ అతిధిగా ఆహ్వానాలు వచ్చినా? కూడా వాటిని సున్నితంగా తిరస్కరించింది. దీంతో సొంత పరిశ్రమలో అమ్మడిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది అన్నది వాస్తవం. దీపికా పదుకొణే మాత్రం నెగిటివిటీ తెచ్చుకోలేదు. ఈ విషయంలో అమ్మడు ఎంతో తెలివిగా వ్యవహరించింది. సొంత పరిశ్రమ గురించి ఏనాడు నెగిటివ్ గా మాట్లాడలేదు. అక్కడ పెద్దలు ఆహ్వానించిన కొన్ని రకాల ఈవెంట్లకు హాజరైంది. ఆ రకంగా దీపిక మాత్రం సొంత పరిశ్రమ నుంచి ఎలాంటి విమర్శలు ఎదుర్కోకుండా సేఫ్ జోన్ లోనే ఉంది.