స్పిరిట్ నుంచి తప్పుకున్నాక గౌరవం
ఇటీవల సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్` నుంచి వైదొలిగిన దీపిక పదుకొనే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన అట్లీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.;
ఇటీవల సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' నుంచి వైదొలిగిన దీపిక పదుకొనే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన అట్లీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపిక ఏదో ఒక కారణంతో నిరంతరం హెడ్ లైన్స్ లోకొస్తోంది. గత ఏడాది హాలీవుడ్ లో వాక్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటిగా వెలిగిపోయింది. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది దీపిక. ప్రముఖ హాలీవుడ్ స్టార్లు సెలీనా గోమెజ్, ఏంజెలీనా జోలీ, బిల్లీ ఎలిష్ వంటి తారలతో పాటు సంస్కృతిని రూపొందించే ప్రపంచ మహిళల `ది షిఫ్ట్` జాబితాలో దీపిక చేరింది.
'ది షిఫ్ట్' జాబితా వివిధ రంగాల్లో పని చేసే మహిళల నేపథ్యాలు, వృత్తి, కళలు, నాయకత్వ లక్షణాలు, ప్రజలపై ప్రభావం సహా అనేక అంశాలను గుర్తించి ఇచ్చే గౌరవం. భవిష్యత్ కోసం స్టోరీలు అందించే నైపుణ్యం వీరి సొంతం అని గుర్తిస్తారు. దీపిక ఈ జాబితాలో ఉండటం భారతీయ సినిమాకి అరుదైన గౌరవం. ప్రపంచవ్యాప్త గుర్తింపులో దక్షిణాసియా స్వరాన్ని దీపికకు వినిపించే అవకాశం అదృష్టం కలిగింది.
ఈ ప్రచురణ దిగ్గజ గ్లోరియా స్టెనిమ్‌కు నివాళులర్పించింది. ఇది మన ప్రపంచ భవిష్యత్తును రూపొందించే మహిళల వేడుక. ప్రచురణ దిగ్గజం గ్లోరియా స్టెనిమ్ కి నివాళిగా 90 మందిని సత్కరించనున్నారు. వృత్తిగత వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేస్తూ, నాయకత్వ లక్షణాలతో ఆదర్శంగా నిలిచేవారికి ఇది తగిన గుర్తింపు. ప్రపంచ వేదికపై దీపిక ఓ వెలుగు వెలుగుతోంది. కేన్స్ పిలింఫెస్టివల్, మెట్ గాలా వంటి చోట్ల గొప్ప గౌరవం అందుకుంది. హాలీవుడ్ లో నటించడం కొనసాగించకపోయినా తనకంటూ గ్లోబల్ ఫ్యాన్స్ స్థిరంగా ఉన్నారు.