కల్కి 2లో స్టార్ హీరోయిన్.. దీపికా స్థానాన్ని భర్తీ చేస్తుందా?
కల్కి పార్ట్ 2లో దీపిక పదుకొనే ప్లేస్ ని ఆ హీరోయిన్ రిప్లేస్ చేయబోతుంది అన్నట్టు రూమర్లు వినిపించడంతో ఇది కాస్త బాలీవుడ్లో వైరల్ గా మారింది.;
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనేకి ఈ మధ్యకాలంలో వరుస షాకులు తగులుతున్నాయి. ఒక సినిమా తర్వాత మరొక సినిమా నుండి దీపిక పదుకొనేని తీసివేస్తూ దర్శక నిర్మాతలు సడన్ షాక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీపిక కూడా ఎవరికి నేను భయపడను అన్నట్లుగా స్పందిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా కల్కి పార్ట్ 2 గురించి ఒక క్రేజీ అప్డేట్ బాలీవుడ్లో వైరల్ అవుతోంది. కల్కి పార్ట్ 2లో దీపిక పదుకొనే ప్లేస్ ని ఆ హీరోయిన్ రిప్లేస్ చేయబోతుంది అన్నట్టు రూమర్లు వినిపించడంతో ఇది కాస్త బాలీవుడ్లో వైరల్ గా మారింది.
ఇక విషయంలోకి వెళ్తే.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మాతగా చేసిన కల్కి 2898 AD మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.ప్రభాస్,దీపిక పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, రాజేంద్రప్రసాద్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే రాజమౌళి,ఆర్జీవి, అనుదీప్ వంటి దర్శకులు గెస్ట్ రోల్స్ చేశారు. ఇందులో దీపిక సుమతీ పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. అలాగే సీక్వెల్లో కూడా ఈమె కంటిన్యూ అవుతుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ కల్కి 2898 AD మూవీకి సీక్వెల్ గా వచ్చే కల్కి పార్ట్ 2 లో దీపిక పదుకొనే నటించడం లేదు అంటూ వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు సంచలన ప్రకటన చేశారు. ఈ అఫీషియల్ ప్రకటనతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. అయితే దీపిక పదుకొనే పెట్టిన కండిషన్స్ వల్లే తనని సినిమా నుండి తీసేసినట్టు పరోక్షంగా హింట్ ఇచ్చారు కూడా. తమ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించాలి అన్నట్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు.
అయితే కల్కి సీక్వెల్ నుండి దీపిక పదుకొనేని తొలగించినట్లు అధికారికంగా ప్రకటించడంతో ఈ హీరోయిన్ పాత్రలో ఎవరైతే బాగుంటుంది అనే చర్చలు ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుష్క, ప్రియాంక చోప్రా వంటి హీరోయిన్ల పేర్లు కూడా తెర మీద వినిపిస్తున్నాయి. అయితే తాజాగా దీపిక ప్లేస్ లో నటి కీర్తి సురేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కీర్తి సురేష్ కల్కి 2898AD మూవీలో ప్రభాస్ దగ్గర ఉండే బుజ్జి కార్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్ నే ఇందులో దీపికా ప్లేస్ లో రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు బాలీవుడ్లో ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది.
మరి ఈ సినిమాలో దీపిక ప్లేస్ ని కీర్తి సురేష్ ఫుల్ ఫిల్ చేయగలదా.. ? కీర్తి సురేష్ కాకుండా ఏ హీరోయిన్ నైతే దీపిక పోషించిన పాత్రకి పూర్తి న్యాయం చేయగలుగుతారు? అనేది ముందు ముందు తెలుస్తుంది. ప్రస్తుతం కల్కి సీక్వెల్ కి సంబంధించి ప్రభాస్ లేని కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్లో ప్రభాస్ వచ్చే ఏడాది జాయిన్ అవబోతున్నట్టు తెలుస్తోంది.