దీపికాకు దెబ్బ మీద దెబ్బ.. ఇప్పట్లో కోలుకుంటుందా?
AA22xA6 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న మూవీలో దీపిక పదుకొనే హీరోయిన్ గా చేస్తున్నట్టు టాక్ వినిపించింది.;
బాలీవుడ్ నటి దీపిక పదుకొనే ఈ మధ్య కాలంలో వరుస వివాదాల్లో ఇరుక్కుంటోంది. స్పిరిట్ మూవీ నుండి ఈమెని తొలగించి వేరే హీరోయిన్ ని పెట్టినప్పటి నుండి ఈ వివాదం స్టార్ట్ అయింది. అలా స్పిరిట్ మూవీ నుండి తీసేసారు అనుకునే లోపే కల్కి సీక్వెల్ నుండి కూడా దీపిక పదుకొనేని తొలగిస్తున్నట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో దీపిక పదుకొనేకి ఒకదాని తర్వాత ఒకటి వరుస షాక్ లు తగిలాయి.. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా విషయంలో కూడా దీపిక పదుకొనేకి అన్యాయం జరుగుతోందని, ఆమెని అలాంటి పాత్ర కోసం చిత్ర యూనిట్ తీసుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ దీపిక పదుకొనేకి అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఎలాంటి పాత్ర ఇచ్చారు? తెర వెనుక ఏం జరుగుతోంది?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
AA22xA6లో దీపికా మెయిన్ హీరోయిన్ కాదా?
AA22xA6 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న మూవీలో దీపిక పదుకొనే హీరోయిన్ గా చేస్తున్నట్టు టాక్ వినిపించింది. అయితే బన్నీ - అట్లీ కాంబోలో వచ్చే ఈ సినిమాలో దీపిక పదుకొనే మెయిన్ హీరోయిన్ కాదని, ఆమె రోల్ ని అతిథి పాత్రకు తగ్గించారనే ఊహగానాలు ప్రస్తుతం బీ టౌన్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే మొదట ఈ సినిమాలో దీపిక కీ రోల్ పోషిస్తుందని వార్తలు వినిపించినప్పటికీ.. ఆ తర్వాత తలెత్తిన వివాదాల కారణంగా దీపికా పాత్రని గెస్ట్ రోల్ కి తగ్గించారనే రూమర్లు వినిపిస్తున్నాయి.
దీపికా ఇప్పట్లో కోలుకుంటుందా?
దీనికి తోడు ఇప్పటికే ఈ సినిమాలో జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లు నటిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్న వేళ.. ఆ హీరోయిన్ లను హైలెట్ చేయడం కోసమే దీపికా పాత్రని తగ్గించారనే రూమర్ వినిపిస్తోంది. అయితే ఇది తెలిసిన నెటిజన్స్ మాత్రం దీపికాకు ఎందుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వీటి నుంచి ఆమె ఇప్పట్లో కోలుకుంటుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు
రూమర్స్ ను ఖండించిన చిత్ర బృందం..
కానీ సోషల్ మీడియాలో వచ్చే ఈ వాదనలని చిత్ర బృందం కొట్టిపారేసింది. దీపిక పదుకొనే పాత్రని అతిథి పాత్రకు పరిమితం చేశారనే వార్తలు అవాస్తవం అని, దీపిక ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. అలా దీపిక పదుకొనే పాత్రని తగ్గించలేదని,ఆమె పాత్ర సినిమాకి మెయిన్ పిల్లర్ అంటూ చెప్పుకొచ్చారు.
దీపిక షెడ్యూల్ అప్పటినుండే..
అలాగే దీపిక పదుకొనే AA22XA6 మూవీలో ఓ భారీ షెడ్యూల్లో జాయిన్ అవ్వబోతుందని దీపిక పదుకొనేకు సంబంధించిన ఈ షెడ్యూల్ నవంబర్ నుండి డిసెంబర్ వరకు షూట్ చేస్తారని తెలుస్తోంది. AA22XA6 మూవీ టైం ట్రావెల్ చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా జానర్ లో తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. అలాగే దీపిక పదుకొనే AA22XA6 సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడం కంటే ముందే షారుక్ ఖాన్ తో కలిసి నటిస్తున్న కింగ్ సినిమా కోసం పోలాండ్ షూటింగ్లో జాయిన్ అవ్వబోతోంది.