లేడీ సూపర్ స్టార్ తో ప్రేమమ్ బోయ్ కొట్టేలా!
ఇందులో నివిన్-నయనతార జంటగా నటిస్తున్నారు. ఇది యూత్ పుల్ కాన్సెప్ట్ గానే కనిపిస్తుంది.;
మాలీవుడ్ స్టార్ నివిన్ పౌలికి కొంత కాలంగా సరైన సక్సెలు పడలేదు. లవర్ బోయ్ గా ఓ వెలుగు వెలిగిన నివిన్ ఒక్కసారిగా వైఫల్యాల బాట పట్టడంతో? అతడి సినిమాలు రిలీజ్ అయినా థియేటర్ వరకే పరిమిత మవుతున్నాయి. ప్రేక్షకులు మాట్లాడుకునే స్థాయికి చేరడం లేదు. `ప్రేమమ్` తో పాన్ ఇండియాలో వచ్చిన క్రేజ్ ను కొసాగించలేకపోయాడు. అప్పటి నుంచి సినిమాల జోరు కూడా తగ్గించాడు. అయితే 2025 లో మాత్రం ఒక్కసారిగా ప్రాజెక్ట్ లన్నీ పట్టాలెక్కించాడు. వాటిలో మోస్ట్ అవైటెడ్ మూవీ గా `డియర్ స్టూడెంట్స్` కనిపిస్తుంది.
ఇందులో నివిన్-నయనతార జంటగా నటిస్తున్నారు. ఇది యూత్ పుల్ కాన్సెప్ట్ గానే కనిపిస్తుంది. ప్రచార చిత్రాలతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. టీజర్ ఆద్యంతం ఆకట్టు కుంటుంది. నివిన్ -నయన్ జోడీ క్రేజీగా ఉంది. రెండు పాత్రల మధ్య సన్నివేశాలు ఇంట్రెస్టింగ్. నివిన్ కామెడీ టైమిం గ్..నయతార సెటిల్డ్ పెర్పార్మన్స్ ఆకట్టుకుంటుంది. రెస్టారెంట్ లో పర్సనల్ అనగానే నయనతార పక్కకెళ్లి కూర్చో వడం.. ప్రతిగా నయన్ ఒళ్లో కొచ్చి కూర్చోమనడం వంటి రొమాంటిక్ సన్నివేశం ఇంట్రెస్టింగ్.
చివరికి ఆమె ఓ పోలీస్ అంటూ అసలు సంగతి రివీల్ చేయగానే? నివిన్ బెంచ్ మారడం లాంటి సన్ని వేశాలు యువతను అలరిస్తున్నాయి. టీజర్ కు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ లవ్, యాక్షన్ , డ్రామాకు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో నివిన్ పౌలీ బౌన్య్ బ్యాక్ అవ్వడం ఖాయ మంటూ సోషల్ మీడియాలోప్రచారం మొదలైంది. అతడి కామెడీ టైమింగ్ కి కనెక్ట్ అవుతున్నారు. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సినిమాకు అదనపు బలం.
'జవాన్' తర్వాత నయన్ కి సరైన సక్సస్ పడలేదు. చేసిన లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు కలిసి రాలేదు. చేతిలో అగ్ర హీరోలతో అవకాశా లున్నా? బలమైన పాత్రలు వస్తే మాత్రం చిన్న హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తుంది. తెలివిగా ఆ చిత్రాలను తన సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మిస్తోంది. 'డియర్ స్టూడెంట్స్' కూడా మావెరిక్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ - పౌలీ జూనియర్ పిక్చర్స్ తో కలిసి రౌడీ పిక్చర్స్ నిర్మిస్తోన్న చిత్రమే.