రిసార్టులు మ్యూజిక్ కాపీ రైట్స్ తీసుకోవాలా?

మ్యూజిక్ లైసెన్సింగ్ సంస్థ అయిన నోవెక్స్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిర్యాదు ఆధారంగా పై రిసార్ట్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది.;

Update: 2025-06-16 03:32 GMT

రిసార్టులు, బార్ అండ్ రెస్టారెంట్ లు, ఇత‌ర‌త్రా వాణిజ్య ప్ర‌దేశాల‌లో మ్యూజిక్ రైట్స్ లేకుండా పాట‌ల‌ను ప్లే చేయ‌డం నేర‌మా? అంటే.. ఇప్పుడు దానికి వివ‌ర‌ణ ఇక్క‌డ ఉంది.

అవసరమైన లైసెన్స్‌లు పొందకుండా కాపీరైట్ ఉన్న‌ పాటలను ప్లే చేయడం నేరం. ఏవైనా వాణిజ్య సంస్థ‌లు హ‌క్కులు, అనుమ‌తులు లేకుండా ప్లే చేస్తే కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించినట్టేన‌ని చ‌ట్టం చెబుతోంది. ఆ ప్ర‌కారం.. రిసార్టులు ఇత‌ర ఎంపిక చేసిన‌ వాణిజ్య సముదాయాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే హ‌క్కు పోలీసుల‌కు ఉంది. తాజాగా ముంబై ప‌రిస‌రాల్లో ఇలాంటి ఒక కేసు సంచ‌ల‌నంగా మారింది. డామన్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ సిల్వాస్సా- డామన్‌లోని ఏడు రిసార్ట్‌లపై కఠినమైన చర్య తీసుకుంది. తీవ్ర పరిశీలనలో ఉన్న రిసార్ట్‌ల వివ‌రాల్లోకి వెళితే... డామన్‌లోని దేవిక బీచ్ రిసార్ట్, హోటల్ సిడాడే దే డామన్ బీచ్ రిసార్ట్, ట్రీట్ రిసార్ట్ సిల్వాస్సా, సిల్వాస్సాలోని ఖాన్వెల్ రిసార్ట్, రాస్ రిసార్ట్ బై ట్రీట్ ఇన్ సిల్వాస్సా, ప్లజ్ రిసార్ట్ సిల్వాస్సా, పెర్ల్ రిసార్ట్ సిల్వాస్సా ల‌పై పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని బాలీవుడ్ హంగామా త‌న క‌థ‌నంలో నివేదించింది.

మ్యూజిక్ లైసెన్సింగ్ సంస్థ అయిన నోవెక్స్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిర్యాదు ఆధారంగా పై రిసార్ట్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. రిసార్ట్ యజమానులు, డైరెక్టర్లు, నిర్వాహకులు కాపీరైట్ చట్టం- 1957 మరియు భారతీయ న్యాయ సంహిత, 2023 కింద కఠినమైన అభియోగాలను ఎదుర్కొంటున్నారు. పాటల రికార్డింగ్‌లు సహా యిత‌ర‌త్రా గట్టి ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అత్యంత అప్రమత్తంగా క‌ఠినంగా సాగుతోంద‌ని స‌మాచారం.

తాజా ఘ‌ట‌న దృష్ట్యా.. నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా చ‌ట్టం ఎంత కీల‌కంగా ప‌ని చేస్తుందో నిరూప‌ణ అయింది. ప్రభుత్వ ఖజానాకు, సంగీత పరిశ్రమకు గణనీయమైన నష్టాన్ని కలిగించే భారీ కుంభకోణాన్ని పోలీసులు సమర్థవంతంగా ఛేదించారని బాలీవుడ్ హంగామా పేర్కొంది. ఈ కఠిన చర్య మ్యూజిక్ లేబుల్స్, కళాకారుల మేధో సంపత్తి హక్కులను రక్షించడంలో చ‌ట్టాల‌ నిబ‌ద్ధ‌త‌ను వెల్ల‌డిస్తోంది.

Tags:    

Similar News