స్టార్ హీరో రేసింగ్ హ్యాబిట్ ఆ రకంగా కలిసొచ్చింది
అంతేకాదు తనకు, షారూఖ్ కు రేసింగ్, రేస్ కార్లు అంటే చాలా ఇష్టం. అది ఆ సినిమాలో సన్నివేశాలకు ఉపకరించిందని కూడా తాహిల్ చెప్పారు.;
ఒక్కోసారి వ్యక్తిగత ప్రవృత్తి సినిమాల్లో కంటెంట్ వర్కవుట్ కావడానికి సహకరించవచ్చు. అలాంటి ఒక అనుభవం గురించి చెప్పుకొచ్చాడు వెటరన్ నటుడు దలీప్ తాహిల్. షారూఖ్ నటించిన బాజీఘర్ (1993) సెట్లలో జరిగిన కొన్ని విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. షారూఖ్ చాలా సీరియస్ మూవీలో సీరియస్ గా ప్రవర్తించే దర్శకులతో కలిసి పని చేస్తున్నాడు. దర్శకులు అబ్బాస్ - మస్తాన్ ఎప్పుడూ సీరియస్ గా ఉంటారు. కానీ షారూఖ్ చాలా చిలిపి కుర్రాడు. అతడు నటించేప్పుడు ఉల్లాసకరమైన చేష్టలతో అందరినీ నవ్విస్తూ, కెమెరా వెనక సన్నివేశాన్ని అతడు సింపుల్ గా పూర్తయ్యేలా చేసేవాడు.. అని తెలిపాడు. అంత సీరియస్ గా ఉండే అబ్బాస్ మస్తాన్ కూడా అతడి చేష్టలకు పగలబడి నవ్వేసేవారని వెల్లడించాడు.
అంతేకాదు తనకు, షారూఖ్ కు రేసింగ్, రేస్ కార్లు అంటే చాలా ఇష్టం. అది ఆ సినిమాలో సన్నివేశాలకు ఉపకరించిందని కూడా తాహిల్ చెప్పారు. తీవ్రమైన ఛేజింగ్ సన్నివేశంలో దానిని వర్కవుట్ చేసామని తెలిపాడు. బాజిఘర్ డార్క్ థీమ్ ఉన్న సినిమా. ఈ సినిమా ఫ్లాపవుతుందని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తే, షారూఖ్ దీనిని నమ్మి చేసాడు. రెగ్యులర్ పాత్రలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందని షారూఖ్ నమ్మాడు. అతడి ధృఢమైన నమ్మకం నిజమైంది. బాజిఘర్ పెద్ద విజయం సాధించింది. చీకటి థీమ్, ప్రతినాయక లక్షణాలున్న హీరోని ప్రజలు అంగీకరించరని భావించినా, అది నిజం కాదని బాజీఘర్ ప్రూవ్ చేసిందని అతడు చెప్పాడు.
చిత్రయూనిట్ సహా నటీనటుల్లో చాలా మందికి బాజిగర్ విజయంపై సందేహాలుండేవి. కానీ అన్నిటినీ బ్లాక్‌బస్టర్ విజయం పటాపంచలు చేసిందని తెలిపారు. గొప్ప స్నేహం, ఆత్మవిశ్వాసం, అద్భుత ప్రదర్శనలు ఆ విజయానికి కారణమని వివరించారు.