ఓవర్సీస్ లోనూ రజనీదే డామినేషన్.. కూలీ, వార్ 2 తేడా ఎంతంటే?
ఇక హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 విషయానికొస్తే, మూడో రోజు వార్ 2 సినిమా, 6.36 లక్షల డాలర్లు సాధించింది.;
ఎన్టీఆర్ వార్ 2, రజనీకాంత్ కూలీ దేశీయంగానే కాదు ఓవర్సీస్ మార్కెట్ లోనూ సై అంటే సై అంటున్నాయి. అయితే ఈ పోటీలో కూడా రజనీ కూలీనే ఆధిక్యంలో ఉంది. ఉత్తర అమెరికాలో కూలీ , వార్ 2 మధ్య బాక్సాఫీస్ యుద్ధం మూడో రోజు కూడా కొనసాగింది. మరి మూడో రోజు ఎవరెంత కొల్లగొట్టారంటే?
3వ రోజు, కూలీ 8.63 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఇక ఓవరాల్ గా ఉత్తర అమెరికాలో కూలీ వసూళ్లు మొత్తం 5.64 మిలియన్ డాలర్లకు చేర్చింది. ఇందులో తెలుగు వెర్షన్ 1.63 మిలియన్ డాలర్లు సాధించింది. ఈ క్రమంలోనే ఓవర్సీస్ లో రజనీ కూలీ అనేక రికార్డులు బ్రేక్ చేసింది. ఈ గణాంకాలు ఓవర్సీస్ మార్కెట్ లో కూలీ ఆధిపత్యాన్ని నొక్కి చెబుతుంది.
ఇక హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 విషయానికొస్తే, మూడో రోజు వార్ 2 సినిమా, 6.36 లక్షల డాలర్లు సాధించింది. మూడో రోజు వసూళ్లను కలుపుకొని ఉత్తర అమెరికాలో కూలీ 2 వసూళ్లు మొత్తం 2.63 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో తెలుగు వెర్షన్ 7.31 లక్షల డాలర్లు వసూల్ చేసింది. అయితే ఒక సినిమాకు ఇవి మంచి నెంబర్సే. అయినప్పటికీ.. కూలీతో పోలీస్తే, వార్ 2 వెనుక బడింది.
కలెక్షన్లలో ఈ వ్యత్యాసం ఓవర్సీస్ లో తమిళం, తెలుగు మాట్లాడే ప్రేక్షకులలో కూలీకి మంచి ఆదరణే దక్కింది. ఇక ఆగస్టు 14న రిలీజైన ఈసినిమా నిన్నటితో తొలి వీకెండ్ రన్నింగ్ పూర్తి చేసుకున్నాయి. లాంగ్ వీకెండ్ పూర్తి అవ్వడంతో రెండు సినిమాలకు వసూళ్లు తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పుడు రెండో వారంలో అసలైన పరీక్ష ఎదుర్కొనున్నాయి. ప్రస్తుతానికైతే, ఉత్తర అమెరికాలో కూలీ ఆధిపత్యం నడుస్తోంది. ఈ హై- ప్రొఫైల్ బాక్సాఫీస్ రేస్ లో వార్ 2 నిలదొక్కుకోడానికి కష్టపడుతోంది.
కాగా, ఇటు దేశీయంగానూ కూలీదే వార్ 2 పై డామినేషన్ గా కనిపిస్తుంది. నాలుగో రోజుల్లో రజనీకాంత్ కూలీ రూ.194.25 కోట్ల కలెక్షన్లు రాబట్టగా.. అదే సమయంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 రూ.173.60 కోట్లు వసూల్ చేసింది. ఇలా ఇండియాలో తొలి వీకెండ్ లో వార్ 2 కంటే కూలీ సినిమాకు రూ.20.65 కోట్ల కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి.