వాళ్లకు మోనికా, వీళ్లకు కబీర్, విక్రమ్

2025 ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉండనుంది. రజనీకాంత్ కూలీ, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 ఆగస్టు 14న ఒకే రోజు భారీ అంచనాలతో రిలీజ్ కానున్నాయి.;

Update: 2025-07-19 03:00 GMT

2025 ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉండనుంది. రజనీకాంత్ కూలీ, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 ఆగస్టు 14న ఒకే రోజు భారీ అంచనాలతో రిలీజ్ కానున్నాయి. రెండు సినిమాలపై బాగానే హైప్ ఉంది. అయితే ప్రేక్షకులను థియేటర్ కు రప్పంచాలంటే ప్రమోషన్స్ కీలకం కానున్నాయి. దీంతో ఇరు సినిమాల మేకర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ తో జనాల్లోకి వెళ్తున్నారు.

కూలీ మేకర్స్ తమ సినిమాను ఎక్కువగా మ్యూజికల్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేశారు. 'చికితు', 'మోనికా' ఈ రెండు పాటలను వదిలారు. ఇవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మోనికా పాటలో పూజా హెగ్డే ఆడిపాడడంతో ఇది సెంటర్ అట్రాక్షన్ గా మారింది. ఇక 'పవర్‌హౌస్' పేరుతో మూడవ పాటను ఈ వీకెండ్ లో విడుదల చేయాలని ప్లాన్ మూవీటీమ్ చేస్తుంది.

ఈ వారాంతంలో హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించి, ఈ ఈవెంట్ లో పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్ హాజరవుతారని అంటున్నారు. ఈ పాట సినిమాపై హైప్ ను మరింత పెంచుతాయని మేకర్స్ భావిస్తున్నారు. ఇది చార్ట్‌ బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

మరోవైపు యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన వార్ 2 కూడా ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే కూలీతో పోలీస్తే వార్ 2 మేకర్స్ ప్రమోషన్స్ ను భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో టీజర్ రిలీజ్ చేయగా, ఆ తర్వాత నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇంకా పాటలు కూడా విడుదల కాలేదు. అయితే వచ్చే వారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

హీరోలు హృతిక్ (కబీర్)- ఎన్టీఆర్ (విక్రమ్) లపైనే మేకర్స్ అంచనాలు పెంచుకున్నారు. వీరిద్దరిని ఓకే స్టేజ్ పై తీసుకురాకుండా సస్పెన్స్ ఉంచుతున్నారు. ఈ స్టార్లను థియేటర్లలోనే సింగిల్ ఫ్రేమ్ లో చూపించాలని మేకర్స్ ప్రమోషన్స్ లో ఈ ఇద్దర్నీ ఒకే వేదికగా చూపించడం లేదు. పూర్తిగా ఈ ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ నే ప్రమోట్ చేయాలని వార్ 2 మేకర్స్ భావిస్తున్నారు.

అలా కూలీ మ్యూజిక్ ప్రమోషన్స్ తో ముందుకెళ్తుంది. అటు వార్ 2 మాత్రం స్టార్ల మధ్య సస్పెన్స్, హై వోల్టేజ్ సన్నివేశాలను ప్రమోషన్స్ కు వాడుకుంటున్నారు. అందుకే ఈ సస్పెన్స్ ను మెయింటేన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు వీకెండ్ లోనే వస్తున్నందున మౌత్ టాక్ కీలకం కానుంది

Tags:    

Similar News