• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కూలి తెలుగు రైట్స్.. ఇది...

కూలి తెలుగు రైట్స్.. ఇది కాస్త రిస్కే..

| లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా కూలి.

By - Tupaki Desk
Update: 2025-06-10 09:45 GMT

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా కూలి. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాపై నాలుగు భాషల అభిమానుల్లో బజ్ ఊపందుకుంది. లోకేష్ మార్క్ యాక్షన్, మాస్ వేరియేషన్‌కి రజనీ స్టైల్ కలగలిపితే ఎలా ఉంటుందో చూడాలని సినీప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో నాగార్జున చాలా రోజుల తర్వాత తమిళంలో మళ్లీ సందడి చేయబోతున్నాడు. ఇందులో ఆయన క్యారెక్టర్ కు స్పెషల్ మాస్ షేడ్స్ ఉన్నట్లు టాక్. రజనీకి విలన్‌గా నటిస్తున్న నాగ్, కన్నడ హీరో ఉపేంద్ర పాత్రలు కూడా ఫ్యాన్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కైది, విక్రమ్, లియో లాంటి సినిమాల తర్వాత లోకేష్ మల్టీ హీరో స్క్రిప్ట్ ఎలా డిజైన్ చేశాడనే క్యూరియాసిటీ ఇప్పటికే పీక్స్‌కి వెళ్లిపోయింది.

ఇలా బజ్ ఉన్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్‌లో ఉన్న టాప్ డిస్ట్రిబ్యూటర్లు గట్టిగానే పోరాటం చేస్తున్నారు. దిల్ రాజు, ఆసియన్ సునీల్, సితార నాగవంశీ, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి వారంతా ఈ రైట్స్‌ను సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పోటీని గమనించిన నిర్మాతలు ఆశతో, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే థియేటర్ల కోసం జీఎస్టీ మినహాయించి రూ. 45 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే కొన్ని సంస్థలు జీఎస్టీ మినహాయించి 36 కోట్లు, ఇంకొంతమంది జీఎస్టీతో కలిపి 43 కోట్లు వరకు ఆఫర్ చేసారని సమాచారం. కానీ నిర్మాతలు మాత్రం కనీసం జీఎస్టీ మినహాయించి 40 కోట్లకు పైగా ధర రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఏడాది ఆగస్టు 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న వార్ 2 కూడా రిలీజ్ కాబోతుండటంతో, ఈ రైట్స్ కొనడంలో కొంత రిస్క్ ఉన్నదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

వార్ 2 ఒక పాన్ ఇండియా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కావడం, హృతిక్ రోషన్ ఫ్యాన్ బేస్ ఉండడం వలన ఇలా అన్నీ కోణాల్లో తీవ్రమైన పోటీని కలిగిస్తాయి. రెండు నెలల ముందే వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలవ్వడం, థియేటర్లు ముందుగానే బ్లాక్ అవ్వడం కూడా కూలీని బయ్యర్లకు తలనొప్పిగా మారుస్తోంది.

కానీ గతంలో విక్రమ్, లియో లాంటి లోకేష్ సినిమాలు తెలుగులో మాస్ లాభాలు అందించడంతో ఆయనపై విశ్వాసం ఉందని ట్రేడ్ అంటోంది. జైలర్ సినిమా కూడా రజనీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో నిర్మాతలు అత్యధిక ధరను ఆశించడంలో తప్పేమీ లేదని చెబుతున్నారు. కానీ అదే సమయంలో ఇది రిస్కే అన్న వాస్తవాన్ని గమనించాల్సిందే. ఇప్పుడు ఈ బేరంలో ఎవరు గెలుస్తారో, ఎవరు నష్టపోతారో చూడాలి.

Tags:    
  • Coolie 
  • Rajinikanth 
  • Nagarjuna 
  • Upendra 
  • AamirKhan 
  • LokeshKanagaraj 
  • Tollywood 
  • TamilCinema 
  • TeluguRights 
  • DilRaju 
  • War2 
  • NTR 
  • HrithikRoshan 
  • MassMultistarrer 
  • Filmindustry 

Similar News

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

Copyright @2026

Powered by Blink CMS