ఓవర్సీస్ లోనూ కూలీదే హవా.. వార్ 2 ను డామినేట్ చేసిన రజనీ
ఎంతగానో ఎదురుచూసిన వార్ 2, కూలీ సినిమాలు నిన్న రిలీజ్ అయిపోయాయి. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ ఫైట్ కు దిగడంతో ఇండస్ట్రీలోనూ ఆసక్తి పెరిగిపోయింది.;
ఎంతగానో ఎదురుచూసిన వార్ 2, కూలీ సినిమాలు నిన్న రిలీజ్ అయిపోయాయి. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ ఫైట్ కు దిగడంతో ఇండస్ట్రీలోనూ ఆసక్తి పెరిగిపోయింది. ఏ సినిమా ఎక్కువ వసూల్ చేస్తుంది? ఏ సినిమా మంచి టాక్ దక్కించుకుంటుందని లెక్కలేసుకున్నారు. అయితే నార్త్ అమెరికాలో రజనీకాంత్ కూలీ డే 1 బాక్సాఫీస్ వద్ద వార్ 2 ను డామినేట్ చేసినట్లు స్పష్టం కనిపిస్తుంది.
కూలీ ఓపెనింగ్ డే నార్త్ అమెరికాలో 8.11 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఇందులో 2.53 లక్షల డాలర్లు ఒక్క తెలుగు వెర్షన్ నుంచి వచ్చినవే. అదే సమయంలో వార్ 2 ఓవరాల్ గా అక్కడ 4.05 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ 1.01 లక్ష డాలర్లే రాబట్టింది. అయితే కూలీ మొదట్నుంచీ హైప్ ఉన్నప్పటికీ.. వాస్తవానికి సేల్స్ ఊహించినదానికంటే తక్కువ అయ్యియి.
అలాగే నార్త్ అమెరికా ప్రీమియర్లలో కూలీకి యూఎస్, కెనడాలో మంచి రెస్పాన్స్ లభించింది. ఇందులో 3.04 లక్షల డాలర్లు ఈ రెండు ఏరియాల నుంచే వచ్చాయి. ఇది ఓ తమిళ సినిమాకు అక్కడ అత్యధిక వసూళ్లు వచ్చిన సినిమాగా కూలీ రికార్డ్ కొట్టింది. అలాగే ప్రీమియర్స్ లో ఓవరాల్ గా భారతీయ చిత్రాల్లో టాప్ 4లో స్థానం దక్కించుకుంది. ఇదంతా రజనీ మార్క్ వల్లే సాధ్యమైందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పట్లో తమిళ్ లో కూలీ రికార్డ్ ను అధిగమించడం కూడా కష్టం అంటున్నారు.
కాగా, తొలి రోజు వరల్డ్వైడ్ గా రూ. 151 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ అఫీషియల్ పేర్కొంది. ఒక తమిళ సినిమా తొలి రోజే రూ.150 మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకుముందు దళపతి విజయ్ లియో సినిమా టాప్ లో ఉండేది. లియో ఫస్ట్ డే 148.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక కూలీ ఆ రికార్డును చెరిపేసి.. కొత్త మార్క్ ను పెట్టింది.
అయితే 50ఏళ్ల సూపర్ స్టార్ కెరీర్ లో తొలి రోజే రూ.150 కోట్లు అందుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఆయన హీరోగా వచ్చిన అనేక సినిమాలు భారీ హిట్ కొట్టాయి. కానీ తొలి రోజే 151 కోట్లు వసూలు చేయలేకపోయాయి. కాగా ఈసినిమాను లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు. రజనీతోపాటు నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.