ఈ కమెడియన్ సక్సెస్ అవుతాడా?

రీసెంట్ గా మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.;

Update: 2026-01-03 17:06 GMT

టాలీవుడ్‌ లో కమెడియన్లకు ఉన్న ఆదరణ ప్రత్యేకం. తమ కామెడీ టైమింగ్‌ తో ప్రేక్షకులను మెప్పించిన పలువురు నటులు, ఆ క్రేజ్‌ ను హీరో ఇమేజ్‌ గా మార్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయోగాలు అందరికీ ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు కమెడియన్ సత్య లీడ్ రోల్ లో జెట్ లీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

నిజానికి.. సత్యకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. కొంతకాలంగా ఏ సినిమాలో అయినా ఆయన కనిపిస్తున్నారు. తన డిఫరెంట్ యాక్టింగ్ తో పాటు బాడీ లాంగ్వేజ్ తో అందరినీ నవ్విస్తున్నారు. ఇప్పుడు హీరోగా జెట్ లీ మూవీతో బిజీగా ఉన్నారు. విమానం హైజాక్ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్టైనర్ గా మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా తెరకెక్కిస్తున్నారు.

రీసెంట్ గా మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానంలో వేమన పద్యం చదువుతూ తనను తాను మరిచిపోయిన వ్యక్తిగా సత్య పరిచయం కావడం ఫన్నీగా అనిపించింది. దానితోడు ఆయనను వెన్నెల కిషోర్ "జనరల్ కంపార్ట్‌మెంట్" హీరో ఇంకా కామెడీగా ఉంది. రితేష్ రానా తన రైటింగ్ తో మరోసారి మెప్పించేలా కనిపిస్తున్నారు.

ఇప్పటికే వివిధ సినిమాలతో మెప్పించిన ఆయన.. ఇప్పుడు జెట్ లీతో కడుపుబ్బా నవ్వించనున్నారని అర్థమవుతోంది. ఏదేమైనా గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తోంది. అయితే మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. తన డెబ్యూ (లీడ్ రోల్ గా)తో సత్య ఎలాంటి హిట్ అందుకుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ కమెడియన్లు హీరోలుగా మారి సినిమాలు చేశారు. అందులో ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది సునీల్. స్టార్ కమెడియన్‌ గా అగ్రస్థానంలో ఉన్న సమయంలో హీరోగా మారారు. మర్యాదరామన్నతోపాటు పలు సినిమాలతో హిట్స్ అందుకున్నారు. కానీ మళ్లీ వరుస ఫ్లాప్స్ రావడంతో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా సినిమాలు చేస్తున్నారు.

ఆ తర్వాత తన టైమింగ్‌ తో అందరినీ నవ్వించే వెన్నెల కిషోర్ హీరోగా ప్రయత్నించినా సక్సెస్ అవ్వలేకపోయారు. వైవా హర్ష వంటి నటులు కూడా హీరోగా ప్రయత్నించినా, వారి సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. సప్తగిరి హీరోగా కొంతవరకు సక్సెస్ అందుకున్నారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి LLB సినిమాలు మంచి వసూళ్లు సాధించినా ఆ తర్వాత చేసిన చిత్రాలు ఫ్లాప్స్ అయ్యాయి.

శ్రీనివాస్ రెడ్డి కూడా ముందు హీరోగా హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో టాలీవుడ్‌ లో కమెడియన్ నుంచి హీరోగా మారడం ఒక సాహసమే. ఇప్పుడు సత్య కూడా అదే చేస్తున్నారని చెప్పాలి. మరి ఇప్పుడు జెట్ లీ మూవీతో ఎలా ఆకట్టుకుంటారో.. సక్సెస్ అవుతారో లేదో చూడాలి.



Full View
Tags:    

Similar News