స్టార్ హీరోపై స్టార్ హీరోయిన్ పీఆర్‌ కక్ష సాధింపు!

చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో తెరకెక్కే సీక్వెల్ చిత్రాల ప్రమోషన్లు ఒక్కోసారి ఊహించని వివాదాలకు వేదికగా మారుతుంటాయి.

Update: 2026-06-08 04:17 GMT

చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో తెరకెక్కే సీక్వెల్ చిత్రాల ప్రమోషన్లు ఒక్కోసారి ఊహించని వివాదాలకు వేదికగా మారుతుంటాయి. ప్రస్తుతం ఒక అగ్ర హీరో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సినిమా ప్రమోషన్స్ ఆరంభ‌మే ఇటువంటి వివాదాలతోనే మొదలయ్యాయి. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఒక కొత్త సాంగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఒక క్లాసిక్ కామెడీ చిత్రంలోని ఐకానిక్ సూపర్ హిట్ సాంగ్‌ను ఈ సరికొత్త సీక్వెల్ కోసం రీక్రియేట్ చేశారు. ఈ కొత్త వెర్షన్‌కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినా.. సదరు స్టార్ హీరో స్క్రీన్ ప్రెజెన్స్, ఒరిజినల్ సింగర్స్ వాయిస్ పాత జ్ఞాపకాలను గుర్తుచేశాయని నెటిజన్లు ప్రశంసించారు. అయితే ఈ పాట విడుదలైన కొద్దిరోజులకే ఒక కొత్త వివాదం తెరపైకి రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

ఆన్‌లైన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఒరిజినల్ చిత్రంలో కథానాయికగా నటించిన ఒక స్టార్ హీరోయిన్ పీఆర్ (PR) టీమ్ ఈ కొత్త పాట విషయంలో స్టార్ హీరో ఇమేజ్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందట‌. కొత్త పాట క్రెడిట్ మొత్తం సదరు స్టార్ హీరోయిన్‌కే దక్కేలా పీఆర్ టీమ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని సినీ మీడియా కోడై కూస్తోంది. గత కొన్ని రోజులుగా పలు మీడియా సంస్థలు ఈ పాటను విశ్లేషిస్తూ.. ఒరిజినల్ సాంగ్‌లో ఆ స్టార్ హీరోయిన్ చేసిన మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని.. ఆ పాట కేవలం ఆ బ్యూటీకే చెందుతుందని కథనాలు రాయడం వెనుక ఈ పీఆర్ కక్ష సాధింపు -పాలిటిక్స్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పీఆర్ టీమ్ ప్రవర్తనను తప్పుపడుతూ... వారిది `కృతజ్ఞత లేనితనం` అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే ఈ కొత్త పాట ముగింపులో స్టార్ హీరో చెప్పే ఒక డైలాగ్ ద్వారా ఆ స్టార్ హీరోయిన్‌ను గౌరవిస్తూ గుర్తు చేసుకున్నా కానీ..పీఆర్ టీమ్ ఇలాంటి దిగజారుడు పద్ధతులకు పాల్పడటం సరికాదని మండిపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ... కొత్త వెర్షన్‌లో నటించిన ప్రస్తుత యువ నటి తన గ్లామర్‌తో సీనియర్ స్టార్ హీరోయిన్‌కు గట్టి పోటీ ఇచ్చిందని... ఇలాంటి కమర్షియల్ చిత్రాలకు అవసరమైన గ్లామర్ హంగులను ఆమె చక్కగా జోడించిందని మద్దతుగా నిలుస్తున్నారు.

మరోవైపు సదరు స్టార్ హీరోయిన్ అభిమానులు కూడా రంగంలోకి దిగి త‌మ ఫేవ‌రెట్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఒరిజినల్ పాట అంత పెద్ద బ్లాక్‌బస్టర్ కావడంలో ఆ స్టార్ హీరోయిన్ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందని వారు గుర్తు చేస్తున్నారు. కేవలం పాట చివర్లో డైలాగ్‌తో సరిపెట్టి థాంక్స్ చెప్పడం కంటే... ఈ కొత్త పాటలో ఆమెతో ఒక క్యామియో (మెరుపు పాత్ర) చేయించి ఉంటే బాగుండేదని... స‌ద‌ర న‌టి ఆ గౌరవానికి ఖచ్చితంగా అర్హురాలని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఈ వివాదం ఎలా ఉన్నా కానీ... స్టార్ హీరో - స్టార్ హీరోయిన్ అభిమానుల మధ్య జరుగుతున్న ఈ సోషల్ మీడియా వార్ నెమ్మదిగా సినిమాపై అంచనాలను పెంచుతోంది.

మొత్తానికి నెగెటివ్ పబ్లిసిటీ రూపంలోనైనా ఈ క్రేజీ సీక్వెల్ చిత్రానికి ఈ వివాదం మంచి బజ్ క్రియేట్ చేయడంలో సహాయపడింది. వివాదాల పక్కన పెడితే మునుముందు ఈ కొత్త వెర్షన్ పాట‌ ఒరిజినల్ ట్రాక్ లాగే చార్ట్‌బస్టర్‌గా నిలిచి ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి. నాటి మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయడం సీక్వెల్ చిత్రాలకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలేన‌ని విశ్లేషిస్తున్నారు.

పరిశ్రమలో హీరోల ఆధిపత్యంపై అసంతృప్తితో ఉండే కొన్ని పీఆర్ వ్యవస్థలు ఇలాంటి సమయాల్లో పాత క్రెడిట్లను వాడుకుని స్టార్ హీరోల ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని చూడటం డిజిటల్ యుగంలో ఒక కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ఇటువంటి అంతర్గత పీఆర్ యుద్ధాలు సినిమాల కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కానీ తారల మధ్య సత్సంబంధాలను మాత్రం దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News