'విశ్వంభర' గ్లింప్స్.. ఎలా ఉందంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మూవీ విశ్వంభర. చిరంజీవి లీడ్ రోల్ పోషిస్తుండగా.. బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో తెరకెక్కిస్తున్నారు;
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మూవీ విశ్వంభర. చిరంజీవి లీడ్ రోల్ పోషిస్తుండగా.. బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి సరసన సౌత్ సినీ ఇండస్ట్రీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆషిక రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ రోల్ లో నటిస్తుండగా.. సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు పోషిస్తున్నారు. బీ టౌన్ బ్యూటీ మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్ తో సందడి చేయనుండగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న విశ్వంభర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఆ మూవీ.. ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల కానుంది. ఆ విషయాన్ని చిరంజీవి స్వయంగా అనౌన్స్ చేశారు.
ఇప్పుడు ఆయన బర్త్ డే (ఆగస్టు 22) సందర్భంగా గ్లింప్స్ ను గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లింప్స్ ఫుల్ వైరల్ అవుతోంది. సినీ ప్రియులను తెగ మెప్పిస్తోంది. సినిమాపై అంచనాలు పెంచుతోంది. వీఎఫ్ ఎక్స్ కు అధిక ప్రాధాన్యమిస్తూ మూవీ తెరకెక్కినట్లు గ్లింప్స్ బట్టి అర్థమవుతోంది.
అయితే ఈ విశ్వంభరలో అసలేం జరిగిందో ఈ రోజైనా చెప్తావా? అంటూ ఓ పిల్లాడి మాటలతో గ్లింప్స్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్నిచ్చింది. అంతకుమించిన మరణశాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతుకున్న ఓ సమూహం తాలూకు నమ్మకం.. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు ఒకడొస్తాడని.. అంటూ మెగాస్టార్ ను పరిచయం చేశారు.
ఆ తర్వాత పిల్లాడు ఎవరినీ అడగ్గా.. చిరును రివీల్ చేశారు. అయితే గ్లింప్స్ లో డైలాగ్ హైలెట్ గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మంచి ఇంటెన్స్ తో ఉంది. చిరంజీవి లుక్ తో పాటు యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ సూపర్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే యమలోకం నుంచి బ్రహ్మలోకం వరకు మొత్తం అన్నీ లోకాలు దాటి సత్యలోకానికి హీరో సినిమాలో వస్తారని తెలుస్తోంది. 14 లోకాలకు మూలమైన బ్రహ్మదేవుడి సత్య లోకాన్ని గ్లింప్స్ లో చూపించారు మేకర్స్. ఓవరాల్ గా లోకాల్లో ట్రావెల్ చేసే కాన్సెప్ట్ తో సినిమా ఉండనుందని అర్థమవుతుంది. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.