చిరు - వెంకీ.. వ్వాటే పిక్!

ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానంలో వెంకీ, చిరు ఉండగా.. వారిద్దరూ కలిసి ఓ ఫోటోకు పోజులిచ్చారు.;

Update: 2025-10-04 17:53 GMT

ఒకే ఫ్రేమ్ లో ఇద్దరూ స్టార్ హీరోలు కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై తమ వాల్స్ లో షేర్ చేస్తుంటారు. ఇప్పుడు అవే మూమెంట్స్ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.

 

ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానంలో వెంకీ, చిరు ఉండగా.. వారిద్దరూ కలిసి ఓ ఫోటోకు పోజులిచ్చారు. చెన్నైలో మరికొద్ది రోజుల్లో జరిగే 80s రీయూనియన్ కోసం ఒకే విమానంలో ఇద్దరూ ప్రయాణించారు. అయితే ఆ ఈవెంట్ లో 80వ దశకంలో వెండితెర వేదికగా సందడి చేసిన అనేక మంది నటీనటులు కలవనున్నారు.

ఆ సమయంలో ఆ నాటి రోజులు అందరూ గుర్తు చేసుకుని సరదాగా గడుపుతుంటారు. గేమ్స్ ఆడుతారు. డ్యాన్స్‌ లు చేస్తారు. ఫుల్ ఎంజాయ్‌ కూడా చేస్తారు. చిరు, వెంకీ కూడా ఇప్పుడు అందులో భాగం కానున్నారు. ఈ సందర్భంగా తమ స్టైల్‌ లో చార్టెర్డ్ ఫ్లైట్ లో కెమెరాకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పిక్ అదిరిపోయిందని అంటున్నారు.

అదే సమయంలో చిరంజీవి లీడ్ రోల్‌లో నటిస్తున్న మన శంకర వరప్రసాద్‌ గారు సినిమాలో వెంకటేష్ గెస్ట్‌ రోల్‌ లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఆ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

సంక్రాంతికి కానుకగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు అనుగుణంగానే మేకర్స్ షూటింగ్ నిర్వహిస్తున్నారు. అనుకున్నట్లు షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు. త్వరలో గుమ్మడి కాయ కొట్టనున్నారు. అయితే సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రను వెంకటేష్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి సినిమాలో చిరు, వెంకీ ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News