మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు మెయిన్ హైలైట్ అదే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ హిట్ మిష‌న్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు.;

Update: 2025-11-09 10:02 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ హిట్ మిష‌న్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు. సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనిల్ రావిపూడి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో పాటూ చిరంజీవితో అనిల్ చేస్తున్న మొద‌టి మూవీ కావ‌డంతో ఈ మూవీపై మొద‌టి నుంచి భారీ అంచ‌నాలున్నాయి.

మొద‌టిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న చిరూ, అనిల్

ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా అనిల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే చిరంజీవి స‌ర‌స‌న ఏకంగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ను హీరోయిన్ గా ఎంపిక చేసిన అనిల్, ఈ సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్ తో క్యామియో రోల్ చేయిస్తున్నారు. చిరూ, వెంకీ క‌లిసి మొద‌టిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నార‌ని తెలిస‌న‌ప్ప‌టి నుంచి ఈ మూవీపై ఆడియ‌న్స్ కు ఎగ్జైట్‌మెంట్ బాగా పెరిగింది.

శంషాబాద్ లో జ‌రుగుతున్న షూటింగ్

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు 2026 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ప‌లు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి కాగా, రీసెంట్ గానే తాజా షెడ్యూల్ లో విక్ట‌రీ వెంక‌టేష్ కూడా పాల్గొన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్ లోని రాజ్ ప్యాలెస్ లో జ‌రుగుతుండ‌గా, శ‌నివారం రోజు చిరంజీవి, వెంక‌టేష్ తో కాంబినేష‌న్ సీన్ ను షూట్ చేశార‌ని, మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారులో ఈ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని యూనిట్ స‌భ్యులు చెప్తున్నారు.

మీసాల పిల్ల సాంగ్ కు అద్భుత‌మైన రెస్పాన్స్

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రీసెంట్ గా మీసాల పిల్ల అనే ఫ‌స్ట్ లిరిక‌ల్ రిలీజ‌వ‌గా, ఆ సాంగ్ కు ఆడియ‌న్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. మీసాల పిల్ల సాంగ్ ఆల్రెడీ 50 మిలియ‌న్ల వ్యూస్ ను దాటి దేశ‌వ్యాప్తంగా రికార్డు సృష్టించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ లో చిరంజీవి త‌న సిగ్నేచ‌ర్ మూమెంట్స్ తో పాటూ మంచి ఎక్స్‌ప్రెష‌న్స్, ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌తో ఆడియ‌న్స్ ను అల‌రించారు.

Tags:    

Similar News