ఆ పాట‌ల‌ కు రికార్డుల మోత ఖాయ‌మ‌ట‌

మెగాస్టార్ చిరంజీవి ఏడు ప‌దుల వ‌య‌సులో కూడా కుర్ర హీరోల‌కు స‌మానంగా వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టి చాలా బిజీగా ఉన్నారు.;

Update: 2025-09-05 09:58 GMT

మెగాస్టార్ చిరంజీవి ఏడు ప‌దుల వ‌య‌సులో కూడా కుర్ర హీరోల‌కు స‌మానంగా వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టి చాలా బిజీగా ఉన్నారు. ఆల్రెడీ విశ్వంభ‌ర షూటింగ్ ను పూర్తి చేసిన చిరూ, ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై అంద‌రికీ మంచి అంచ‌నాలున్నాయి.

టైటిల్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్

ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే అనిల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా, రీసెంట్ గా చిరూ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మూవీ నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్ అంద‌రినీ ఎంతో ఆక‌ట్టుకుంది. అనిల్ ఈ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తుండ‌గా, తాజాగా చిత్ర యూనిట్ మ‌న శంక‌ర‌వ‌రప్ర‌సాద్ గారుకి సంబంధించిన అప్డేట్ ను షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ ను చేసింది.

పండ‌క్కి విజువ‌ల్ ట్రీట్ గ్యారెంటీ

ఆల్రెడీ కేర‌ళ‌లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ మూవీ ఇప్పుడు కొత్త షెడ్యూల్ కు రెడీ అయింది. సెప్టెంబ‌ర్ 5 నుంచి 19 వ‌ర‌కు ఈ షెడ్యూల్ షూటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని, ఈ షెడ్యూల్ లో రెండు సాంగ్స్ ను షూట్ చేయ‌నున్నార‌ని, ఈ రెండు పాట‌లూ రికార్డుల ప‌రంగా మోత మోగించ‌డం ఖాయ‌మ‌ని, 2026 సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కు విజువ‌ల్ ట్రీట్ తో పాటూ ఫుల్ మీల్స్ ఖాయ‌మ‌ని టీమ్ పేర్కొంది.

నెక్ట్స్ స‌మ్మ‌ర్ లో విశ్వంభ‌ర‌

అక్టోబ‌ర్ 5 నుంచి మొద‌ల‌య్యే షెడ్యూల్ లో వెంక‌టేష్ కూడా జాయిన్ కానున్నార‌ని రీసెంట్ గా నిర్మాత‌ల్లో ఒక‌రైన సాహు గార‌పాటి తెలిపారు. దీంతో పాటూ చిరూ నుంచి నెక్ట్స్ ఇయ‌ర్ విశ్వంభ‌ర కూడా రిలీజ్ కానుంది. బింబిసార డైరెక్ట‌ర్ వశిష్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సోషియో ఫాంట‌సీ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉండ‌గా, నెక్ట్స్ ఇయ‌ర్ స‌మ్మ‌ర్ కు విశ్వంభ‌ర‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాన‌ని చిరూ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ రెండు సినిమాల త‌ర్వాత చిరంజీవి బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను, శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను లైన్ లో పెట్టారు.

Tags:    

Similar News