ఈ జీవితం ఆయనకే అంకితం -తేజ సజ్జ

ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న తేజా సజ్జా తన జీవితం ఆయనకే అంకితం అంటూ పలు ఊహించని కామెంట్లు చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.;

Update: 2025-09-08 16:23 GMT

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. సమంత లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన 'ఓ బేబీ' చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి, ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో హీరోగా మారారు. ఇక హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జా.. ఇప్పుడు సూపర్ యోధాగా మిరాయ్ చిత్రంతో సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న తేజా సజ్జా తన జీవితం ఆయనకే అంకితం అంటూ పలు ఊహించని కామెంట్లు చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

తేజ సజ్జా తన మిరాయ్ మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ కారణం చిరంజీవి గారే.. చిరంజీవి సార్ ఆరోజు నా ఫోటో చూజ్ చేసుకోకపోయి ఉంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు.ఎందుకంటే 'చూడాలని ఉంది' సినిమా టైంలో చాలామంది చిన్న పిల్లల ఫోటోలు చిరంజీవి సార్ దగ్గరికి వచ్చాయి.. అందులో ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేయమని సార్ కి చెప్పారు.కానీ ఆయన ఆరోజు నా ఫోటోనే సెలెక్ట్ చేశారు. ఒకవేళ ఆరోజు చిరంజీవి సార్ నా ఫోటో సెలెక్ట్ చేయకపోయి ఉంటే ఈ రోజు ఇండస్ట్రీలో నేను ఉండే వాడిని కాదు. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ సినిమా జీవితం ఆయనకే అంకితం" అంటూ తేజా సజ్జా ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. "నా చిన్నతనంలో నేను ఎంతోమంది గొప్ప వ్యక్తుల మధ్య పెరిగాను. ముఖ్యంగా చిరంజీవి నన్ను సొంత కొడుకులాగే చూసుకున్నారు.అందుకే చిరంజీవి సార్ మీద నాకు చాలా గౌరవం.. ఇక చిన్నతనంలో చాలామంది హీరోలతో నటించాను. పెద్దయ్యాక కూడా హీరో అవుతాను.. సినిమాల్లోనే రాణిస్తాను అని చెబితే మా వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి.. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో అని మా వాళ్లకు భయం.కానీ పట్టుబట్టి ఇండస్ట్రీలోకి వచ్చాను.

హనుమాన్ మూవీ హిట్ అయిన సమయంలో చిరంజీవి సార్ నాకు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాలు మాట్లాడి ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలి.. ఎలాంటి సినిమాలు చూజ్ చేసుకోవాలి..ఫ్యూచర్లో ఎలా ఉండాలి అని ఎన్నో విషయాలు చెప్పారు. నేను చేసిన ఓ బేబీ సినిమా టైంలో నేను ఇండస్ట్రీలో అందరికీ తెలియడం కోసం సమంత నన్నే ప్రమోషన్స్ కి ఎక్కువగా వెళ్ళమన్నారు.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అందరిలాగే నేను కూడా ఇబ్బందులు పడ్డాను.. ఎంతోమంది మొహం మీద తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు.అలా ఎన్నో అవమానాలు, ఛీదరింపులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత నా మీద నాకు నమ్మకం కలిగింది.ఏదైనా సాధించగలను అని ఫిక్స్ అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చాను.

చాలామంది సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్ను మోసం చేశారు. అందులో పెద్ద పెద్ద వాళ్లే ఉన్నారు. ఓ స్టార్ డైరెక్టర్ అయితే నన్ను ఆయన సినిమా కోసం తీసుకొని..ఏకంగా 15 రోజులు షూట్ చేశాక అందులో నుండి తీసేశారు. కానీ ఆ తర్వాతే నా ప్లేస్ లో వేరే హీరోని తీసుకుంటారని అర్థమైంది. ఇక ఆ హీరోకి సీన్స్ ఎలా ఉంటాయో చూపించడం కోసమే నాతో మాక్ షూట్ చేశారని చాలా లేటుగా అర్థమైంది అంటూ తనకి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు తేజ సజ్జా.. అయితే ఆ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు.

Tags:    

Similar News