పెద్ది ట్రైలర్ చూసి ఉత్సాహం ఆపుకోలేకపోయిన చిరూ.. బుచ్చిబాబుకు సారీ!
చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ అప్డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా కామెంట్స్.
సాధారణంగా తనకు నచ్చిన విషయాలను అభిమానులతో పంచుకోవడంలో ముందుండే చిరంజీవి, ఈసారి పెద్ది ట్రైలర్ చూసిన వెంటనే తన ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకోలేక కొన్ని కీలక విషయాలను బయటపెట్టేశారు. దీంతో #ChiruLeaks మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. పెద్ది ట్రైలర్‌పై చిరంజీవి ఇచ్చిన రియాక్షన్ చూస్తుంటే, పెద్ది కేవలం ఓ కమర్షియల్ సినిమా కాదనిజ.. ఎమోషన్స్, ఎలివేషన్స్, ఇంటెన్స్ డ్రామాతో కూడిన ఒక పవర్‌ఫుల్ మూవీ ఎక్స్‌పీరియెన్స్ గా ఉండబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ట్రైలర్‌ను ప్రత్యేకంగా చూసిన తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబుకు సరదాగా క్షమాపణలు చెబుతూ, ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోయాను అని చెప్పడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ట్రైలర్ లో ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్.. అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని చిరూ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు, ట్రైలర్‌లోని ఓ డైలాగ్‌ను కూడా చిరంజీవి లీక్ చేయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు…” అనే ట్రైలర్ లోని డైలాగ్ ను చిరూ లీక్ చేయగా, ఆ డైలాగ్ ఇప్పటికే మెగా ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ ను ఇస్తోంది. ఈ ఒక్క లైన్‌తోనే సినిమాలో హీరో పాత్ర ఎంత ఎమోషనల్ మరియు ఇంటెన్స్‌గా ఉండబోతోందో అర్థమవుతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, బుచ్చిబాబు విజన్, ఏఆర్ రెహమాన్ సంగీతం కలిసి ట్రైలర్‌ను ప్యూర్ సినిమా మ్యాజిక్ స్థాయికి తీసుకెళ్లాయని చిరంజీవి ప్రశంసించడం అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది.
చిరంజీవి రియాక్షన్ తర్వాత ఇప్పుడు ట్రైలర్ లాంచ్‌పై మరింత ఉత్కంఠ నెలకొంది. మే 18న ముంబైలో గ్రాండ్‌గా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రిలీజ్ కు ముందే ట్రైలర్‌కు ఇంత భారీ హైప్ రావడం, సినిమా స్థాయిని మరింత పెంచుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించగా, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పెద్ది రిలీజ్ కానుంది.