ట్రైన్ కామెడీ సెంటిమెంట్.. ఈసారైనా త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ముఖ్యంగా రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ సినిమాలో ట్రైన్ కామెడీ సీక్వెన్స్ ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పవచ్చు. ఆ రైలు ప్రయాణంలో వచ్చే హిలేరియస్ సీన్లు, డైలాగులు జనాల మైండ్ లో అలా నాటుకుపోయాయి.
టాలీవుడ్ లో ట్రైన్ జర్నీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కామెడీ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ సినిమాలో ట్రైన్ కామెడీ సీక్వెన్స్ ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పవచ్చు. ఆ రైలు ప్రయాణంలో వచ్చే హిలేరియస్ సీన్లు, డైలాగులు జనాల మైండ్ లో అలా నాటుకుపోయాయి. అయితే ఆ తర్వాత చాలా సినిమాల్లో అదే తరహాలో ట్రైన్ జర్నీ కాంబినేషన్ సీన్స్ వచ్చినా ఆ స్థాయిలో ఎక్కడా వర్కౌట్ కాలేదు. ఈమధ్య కాలంలో మళ్ళీ ఆ తరహాలో కామెడీ రిపీట్ చేస్తాం అంటూ హడావుడి చేసిన దర్శకులు ఎవరూ వెంకీ రేంజ్ లో మెప్పించలేకపోయారు.
గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో అనిల్ రావిపూడి ఒక పెద్ద ట్రైన్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. రావు రమేష్, మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్, రష్మిక లాంటి క్యారెక్టర్లతో ఆ సీన్ ని నడిపించినా అది అంచనాలకు తగ్గట్టుగా రాలేదని ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని మాత్రం రావిపూడి డిస్సపాయింట్ చేయలేదు.
ఇక ఈ జోనర్ కి పర్ఫెక్ట్ మేకర్ అనే శ్రీనువైట్ల కూడా ఆ మధ్య గోపిచంద్ తో చేసిన విశ్వం సినిమాలో ఒక ట్రైన్ జర్నీ ఎంటర్టైన్మెంట్ ని ప్లాన్ చేశాడు. పాత వింటేజ్ కామెడీని గుర్తు చేయాలని చూసినా, అసలు ఆ సినిమానే బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. దాంతో ఆ సినిమాలో ఉన్న ట్రైన్ ఎపిసోడ్ గురించి కూడా జనాలు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు ట్రై చేసినా ఆ పాత మ్యాజిక్ ని రీక్రియేట్ చేయడం ఎంత కష్టమో దీనివల్ల అర్థమైంది.
ఇప్పుడు లేటెస్ట్ గా త్రివిక్రమ్ వంతు వచ్చింది. వెంకటేష్ తో ఆయన తీస్తున్న లేటెస్ట్ మూవీ ఆదర్శ కుటుంబంలో దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఒక క్రేజీ ట్రైన్ సీక్వెన్స్ ఉండబోతోందని ఇండస్ట్రీలో హడావుడి మొదలైంది. అయితే త్రివిక్రమ్ రైటింగ్ స్టైల్ రేంజ్ కు తగ్గ కామెడీ సీన్స్ ఈమధ్య కాలంలో అస్సలు పడలేదు. ఆయన గత సినిమాల్లో కూడా కామెడీ అంటూ ప్రత్యేకంగా థియేటర్లలో మెప్పించింది ఏమీ లేదు. ప్రాసల మీద పెట్టిన శ్రద్ధ సిట్యువేషనల్ ఫన్ మీద పెట్టట్లేదనే విమర్శలు ఉన్నాయి.
అయినప్పటికీ వెంకీ కామెడీపై ఆడియన్స్ లో ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాస్తే, వాటిని స్క్రీన్ పై నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది వెంకటేష్ బాడీ లాంగ్వేజే. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాలో ఈ ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలవబోతోందని టాక్ రావడంతో ఫ్యాన్స్ మళ్ళీ ఆశలు పెట్టుకున్నారు.
ఈసారి త్రివిక్రమ్ మార్క్ పంచ్ లతో పాటు ఆ పాత మార్క్ ఫన్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత డైలాగ్ కామెడీ కాకుండా సిట్యువేషనల్ కామెడీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రైలు ప్రయాణం ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి. ఒకవేళ త్రివిక్రమ్ రాసుకున్న సీన్లు గనుక పక్కాగా కుదిరితే, టాలీవుడ్ లో వెంకీ సినిమా తర్వాత ఆ రేంజ్ లో మాట్లాడుకునే మరో క్రేజీ ట్రైన్ ఎపిసోడ్ ఇదవుతుంది. మరి అక్టోబర్ లో రాబోతున్న ఈ ఆదర్శ కుటుంబం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.