బ్రేక్‌ఫాస్ట్‌ తింటూ... పాములంటే భయం లేదు!

ఒక హీరోయిన్‌ కావడంతో ఆ వ్యాఖ్యలు అంతగా వైరల్‌ అవుతున్నాయి. ఆ హీరోయిన్‌ మరెవ్వరో కాదు ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నభా నటేష్ పాముల గురించి మాట్లాడింది.

Update: 2026-07-01 07:46 GMT

సాధారణంగా అమ్మాయిలు బొద్దింకలు, బల్లులు చూస్తేనే గావు కేకలు పెడుతూ, ఇల్లు పీకి పందిరి వేసినంత పని చేస్తారు. అమ్మాయిలు మగవారి కంటే బొద్దింకలు, బల్లులకు ఎక్కువగా భయపడుతారు అని మీమ్స్‌ కూడా వస్తూ ఉంటాయి. అలాంటిది అమ్మాయిలు పాములను చూస్తే ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పామును చూస్తూ పది రోజుల పాటు మర్చి పోకుండా భయపడుతూనే ఉంటారు. ఆ పాము కనిపించిన చోటుకు కనీసం నెల రోజులు పోకుండా దూరంగా ఉంటారు. అలాంటిది ఒక అమ్మాయి మాత్రం తనకు పాములు అంటే భయం లేదు, పాములతో సహవాసం చేస్తాను అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు... ఒక హీరోయిన్‌ కావడంతో ఆ వ్యాఖ్యలు అంతగా వైరల్‌ అవుతున్నాయి. ఆ హీరోయిన్‌ మరెవ్వరో కాదు ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నభా నటేష్ పాముల గురించి మాట్లాడింది.

నాగబంధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు...

చాలా కాలం తర్వాత నభా నటేష్ తెలుగులో నాగబంధం అనే సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగబంధం సినిమా ప్రమోషన్‌లో భాగంగా నభానటేష్‌ పలు ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్‌ చేసుకుంది. నాగబంధం సినిమాలో ఎక్కువగా పాములను చూడబోతున్నామని టైటిల్‌ను చూస్తేనే అర్థం అవుతుంది. షూటింగ్‌ సమయంలో కొన్ని సార్లు రియల్‌ పాములు వాడినట్లు ఆ మధ్య యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. నిజమైన పాములు వాడిన సమయంలో సెట్స్‌ లో ఉండే నటీనటుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే నభా నటేష్‌ మాత్రం పెద్దగా భయపడేది కాదట. ఎందుకంటే ఆమెకు చిన్నప్పటి నుంచి పాములు చూసి ఉండటం వల్ల వాటిని చూస్తే భయం వేయదట. తన పూర్వీకుల కాలంకు చెందిన ఇంటిలో పాములు అనేవి సర్వసాధారణంగా నభా నటేష్‌ చెప్పుకొచ్చింది.

పాముల గురించి నభా నటేష్‌...

నాగబంధం సినిమా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో భాగంగా నభానటేష్ మాట్లాడుతూ... తనకు పాములంటే పెద్దగా భయం ఉండదని చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు తాను ఉన్న ఇంట్లో పాములు రెగ్యులర్‌గా కనిపించేవి. కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతానికి చెందిన వారికి పాములు అంటే భయం ఉండదని, తాను ఆ ప్రాంతానికి చెందిన దాన్ని అంటూ నభా పేర్కొంది. చిన్నతనంలో తాను సోదరుడితో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ తింటున్న సమయంలో బయట పాములు కనిపించేవని నభా నటేష్‌ చెప్పుకొచ్చింది. ఎదురుగా పాములు తిరుగుతూ ఉన్నప్పటికి ఎలాంటి భయం లేకుండా తింటూ, తిరుగుతూ, ఆడుకుంటూ ఉండేవాళ్లం అని నభా నటేష్‌ పేర్కొంది. తాతల కాలం నాటి ఇల్లు కావడంతో ఇంట్లోకి పాములు రావడం సర్వ సాధారణం అనిపించేదని ఈ సందర్భంగా నభా నటేష్ చెప్పుకొచ్చింది. అందుకే షూటింగ్‌ సమయంలో పాములు కనిపించినా పెద్దగా భయం కాలేదని అంది.

శివరాజ్‌ కుమార్‌ మూవీతో ఎంట్రీ...

19 ఏళ్ల వయసులో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ సినిమా వజ్రకాయతో ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్‌ మొదటి సినిమాతోనే హిట్‌ కొట్టింది. కన్నడం లో వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. అదే సమయంలో తెలుగులోనూ మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే తెలుగులో ఈమెకు కాలం కలిసి రాలేదు. హిట్‌ పడ్డా స్టార్‌ హీరోలు ఈమెను పట్టించుకోలేదు. దాంతో చిన్న సినిమాలకు పరిమితం అయ్యింది. ఆ మధ్య చిన్న సినిమాలు సైతం నిరాశపరచడంతో రెండు మూడు ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మళ్లీ నాగబంధం సినిమాతో రీ ఎంట్రీకి సిద్ధం అయింది. మరి ఈ అమ్మడికి ఈ సినిమాతో తెలుగులో మళ్లీ పెద్ద ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి. సెకండ్‌ ఇన్నింగ్స్‌ హిట్‌తో ప్రారంభిస్తే నభాకు కచ్చితంగా కలిసి వస్తుందనే అభిప్రాయం ను సినీ విశ్లేషకులు, ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. నాగబంధం సినిమాతో నభానటేష్‌ కొత్తగా కనిపించబోతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Tags:    

Similar News