క్రేజీ 'అమీర్ లోగ్'.. ఇప్పుడు రానా సపోర్ట్‌ తో..

చిన్న సినిమాలకు మంచి కంటెంట్ ఉంటే చాలు.. పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు అదే జాబితాలో చేరింది అమీర్ లోగ్.

Update: 2026-07-01 08:39 GMT

చిన్న సినిమాలకు మంచి కంటెంట్ ఉంటే చాలు.. పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు అదే జాబితాలో చేరింది అమీర్ లోగ్. ఇప్పటికే టీజర్, పోస్టర్లు, పాటలతో యూత్ లో సినిమా ఆసక్తి పెంచగా, ఇప్పుడు నటుడు రానా దగ్గుబాటి స్థాపించిన స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.



 


అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రలు పోషించారు. వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్ లో ముగ్గురు స్నేహితుల జీవితాల చుట్టూ సాగే యూత్‌ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్‌ గా సినిమాను రూపొందించారు.

సినిమా ప్రారంభం నుంచే ప్రమోషన్లలో స్పెషల్ కేర్ తీసుకున్న మూవీ టీమ్.. ముందుగా టైటిల్, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ను విడుదల చేసింది. హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రివీల్ చేసిన ఫస్ట్‌ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పోస్టర్‌ లో కనిపించిన రోల్స్, హైదరాబాద్ నేటివిటీ ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచాయి. దీంతో సినిమా ఎలాంటి కథతో రాబోతోందన్న చర్చ కూడా మొదలైంది. ఆ తర్వాత విడుదలైన ప్రచార కంటెంట్ సినిమా కు ప్లస్‌ గా మారింది.

ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన అవ్వల్ దావత్ పాట మంచి రెస్పాన్స్ అందుకుంది. యూట్యూబ్‌ లో మిలియన్‌ కు పైగా వ్యూస్ సాధించిన ఈ పాటలో ఆనీ మాస్టర్ కొరియోగ్రఫీ, మాస్ బీట్ ఆకట్టుకున్నాయి. టీజర్ కూడా కామెడీ తో పాటు హైదరాబాద్ కల్చర్‌ రిఫ్లెక్ట్ చేసేలా ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమా గురించి ఆసక్తి మరింత పెరిగింది. ఇలాంటి సమయంలో స్పిరిట్ మీడియా రంగంలోకి రావడం టీమ్ కు పెద్ద బలంగా మారిందని చెప్పాలి.

మంచి స్టోరీ, ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఉన్న చిన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో స్పిరిట్ మీడియా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు అదే సంస్థ అమీర్ లోగ్ పంపిణీ హక్కులు సొంతం చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలని నిర్ణయించడం సినిమాకు ఎక్స్ ట్రా బూస్ట్ వచ్చినట్లైంది. అయితే సినిమా కంటెంట్ నచ్చడంతో స్పిరిట్ మీడియా సపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ గల్లీలలో పెరిగిన ముగ్గురు స్నేహితుల ప్రయాణం, వారి మధ్య జరిగే సరదా సంఘటనలు, ఎమోషన్స్, యూత్‌ కు చేరే మెసేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సంస్థ నమ్ముతోంది. అందుకే సినిమాను గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది. ఇక మూవీ సినిమాటోగ్రఫీని ఎస్‌వికె అందించగా, స్మరణ్ సాయి సంగీతం సమకూర్చారు. రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు వచ్చిన రెస్పాన్స్, ఇప్పుడు స్పిరిట్ మీడియా మద్దతు కలిసి అమీర్ లోగ్ పై అంచనాలు మరింత పెంచుతున్నాయి. మరి యూత్‌ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News