జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు.;

Update: 2025-08-22 04:09 GMT

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. మెగా బ్రదర్స్ గా చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న బాండింగ్ అందరికీ తెలిసిందే. అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అనిపించేలా వీళ్లిద్దరి ఆప్యాయత అనురాగాలు ఉంటాయి. చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకి విష్ చేస్తూ తన చిన్నప్పటి ఫోటోని షేర్ చేశారు.

తమ్ముడు కళ్యాణ్ అంటూ..

ఐతే దానికి చిరంజీవి ఉప్పొంగిపోయాడు.. తమ్ముడు కళ్యాణ్ అంటూ తను రాసిన ప్రతి మాట.. ప్రతి అక్షరం నా హృదయాన్ని తాకిందంటూ మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ చిరంజీవి ఇలా రాసుకొచ్చారు.

త‌మ్ముడు క‌ల్యాణ్‌...ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. ప్ర‌తీ మాట‌, ప్ర‌తీ అక్ష‌రం నా హృద‌యాన్ని తాకింది. అన్న‌య్య‌గా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో, ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. నీ కార్య‌దీక్ష‌త‌, ప‌ట్టుద‌ల చూసి ప్ర‌తీ క్ష‌ణం గ‌ర్వ‌ప‌డుతూనే ఉన్నా. నిన్ను న‌మ్మిన‌వాళ్ల‌కు ఏదో చేయాల‌న్న త‌ప‌నే నీకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త శ‌క్తిని ఇస్తుందని అన్నారు చిరంజీవి.

నీ వెనుక కోట్లాదిమంది జన‌సైనికులు..

అంతేకాదు ఈ రోజు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు. అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా ల‌భిస్తూనే ఉండాలి. ఓ అన్న‌య్య‌గా నా ఆశీర్వ‌చ‌నాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్ర‌తీ అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నానంటూ ముగించారు చిరంజీవి.

చిరంజీవి కష్టం గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన స్పీచ్ లో చెబుతూనే ఉంటాడు. అన్న కష్టాన్ని గుర్తించిన తమ్ముడు అన్నయ్య మీద అదే ప్రేమ అప్యాయతను కొనసాగిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయ శక్తిగా ఎదిగినా సరే అన్నయ్య కాళ్ల మీద మోకరిల్లడానికి కూడా వెనకాడలేదు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ విష్ చేయడం దానికి రిప్లైగా జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు అంటూ చిరంజీవి స్పందించడం మెగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీస్ లో ఉన్న చిరంజీవి అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



Tags:    

Similar News