చిరంజీవి కోరడం వల్లే నాని ఆ పనికి రెడీ అయ్యాడట!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా విడుదల కాకముందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నారు.;

Update: 2025-04-26 05:54 GMT

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా విడుదల కాకముందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నారు. సమ్మర్‌ తర్వాత చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. 2026 సంక్రాంతికి చిరు రావిపూడి మూవీ రావడం కన్ఫర్మ్‌ అయింది. ఈ ఏడాదిలో విశ్వంభర, వచ్చే ఏడాది ఆరంభంలో అనిల్ రావిపూడి సినిమాతో రాబోతున్న చిరంజీవి వచ్చే ఏడాది చివరి వరకు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. 'దసరా' దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా ప్రకటన వచ్చింది.

దసరా సినిమా తర్వాత నానితో శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ సినిమాను చేస్తున్నాడు. హిట్ 3 సినిమా విడుదల తర్వాత ది ప్యారడైజ్ సినిమాపై నాని పూర్తి స్థాయి ఫోకస్ పెట్టబోతున్నాడు. శ్రీకాంత్‌ ఓదెల మేకింగ్‌పై నమ్మకంతో నాని స్వయంగా చిరంజీవి వద్దకు తీసుకు వెళ్లారట. చిరంజీవి కథ నచ్చడంతో శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు. ఆ సమయంలోనే చిరంజీవి కండీషన్ పెట్టాడట. శ్రీకాంత్‌ ఓదెలతో సినిమాకు ఓకే కాని.. ఈ సినిమాకు నువ్వు నిర్మాతగా ఉండాలని చిరంజీవి స్వయంగా నానిని కోరాడట. అందుకు మొదట నాని కాస్త వెనకాడినా శ్రీకాంత్‌ ఓదెల పై నమ్మకంతో, ఆయన చెప్పిన కథను నమ్మి నిర్మించేందుకు సిద్ధం అయ్యాడు.

చిరంజీవి, శ్రీకాంత్‌ ఓదెల కాంబో సినిమాను నానితో కలిసి సుస్మిత కొణిదెల నిర్మించబోతున్నారు. ఈ మధ్య కాలంలో నాని హీరోగానే కాకుండా నిర్మాతగానూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోర్ట్‌ సినిమాతో నాని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కథల ఎంపిక, కథలను నమ్మడం నానికే చెల్లుతుంది. నాని సెలక్షన్‌ పై నమ్మకంతో చిరంజీవి ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పి ఉంటాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి సినిమా, నాని నిర్మాత అంటే మామూలుగా ఉండదు. నాని నిర్మాతగా చేసిన సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

శ్రీకాంత్‌ ఓదెల మేకింగ్‌పై నానికి చాలా నమ్మకం ఉంది. చిరంజీవి వద్దకు తీసుకు వెళ్లి మరీ కథను చెప్పించాడు. చిరంజీవి వంటి పెద్ద స్టార్‌ సినిమాను నిర్మించేందుకు నాని సిద్ధం కావడానికి కూడా కారణం శ్రీకాంత్‌ ఓదెలపై నమ్మకం అని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న విశ్వంభర, ఆ తర్వాత చేయబోతున్న రావిపూడి సినిమాలతో పోల్చితే శ్రీకాంత్‌ ఓదెలతో చేయబోతున్న సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తి ఎక్కువగా ఉంది. సినిమా ప్రకటన సమయంలో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. చిరంజీవిని ఎలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారో అలా శ్రీకాంత్‌ ఓదెల చూపించడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News