చిరు-ఓదెల ప్రాజెక్ట్.. నాని కామెంట్స్ విన్నారా?

దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నేచురల్ స్టార్ నిర్మాతగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.;

Update: 2025-04-23 08:16 GMT

దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నేచురల్ స్టార్ నిర్మాతగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనౌన్స్మెంట్ తోనే చిరు- ఓదెల- నాని ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్, ఆడియన్స్ వేరే లెవెల్ లో అంతా హోప్స్ పెట్టుకున్నారనే చెప్పాలి.

అయితే ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని అంతా వెయిట్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉండనుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ అప్డేట్స్ రావడం లేటు.. సోషల్ మీడియాలో అంతా వైరల్ చేస్తున్నారు. తాజాగా నాని.. తన అప్ కమింగ్ మూవీ హిట్-3 ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

ప్యారడైజ్ మూవీ తర్వాత చిరంజీవి ప్రాజెక్టు పనులు స్టార్ట్ అవుతాయని నాని తెలిపారు. ప్యారడైజ్ మూవీ షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలవుతుందని చెప్పారు. మెగాస్టార్ సినిమాను 2027లో విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమాకు సంబంధించిన అన్ని అప్డేట్స్ మరికొద్ది రోజుల్లో ఇస్తామని నేచురల్ స్టార్ పేర్కొన్నారు.

సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, టైటిల్ వంటి మరిన్ని అప్డేట్స్ ను తప్పకుండా ఇస్తామని అన్నారు. అదే సమయంలో తాను చిన్నప్పటి నుంచి సత్యం థియేటర్ వద్ద చిరంజీవి సినిమా పోస్టర్స్ పెరిగానని చెప్పారు. ఆయనంటే తనకు మాటల్లో చెప్పలేని అభిమానముందని వెల్లడించారు.

అదే సమయంలో ఇప్పుడు మెగాస్టార్ సినిమాకు నిర్మాతకు వ్యవహరిస్తుంటే.. ఒక బయోపిక్ తీస్తున్న ఫీలింగ్ కలుగుతుందని నాని అన్నారు. ఎప్పుడూ ఆ మూవీ కోసమే ఆలోచిస్తున్నానంటూ చెప్పారు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అని తెలిపారు. దీంతో నాని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

అయితే చిరంజీవి-శ్రీకాంత్ మూవీ స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. వచ్చే ఏడాది షూటింగ్ మొదలు కావచ్చు. కానీ నాని మాత్రం ఆ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఎంతైనా ఫ్యాన్ కదా అందుకేనేమో. మరి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు వస్తుందో.. ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News