చిరు 157లో ఆమెకు ఛాన్స్ ఉందా..?
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా తర్వాత చేస్తున్న సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మెగా 157 సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.;

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా తర్వాత చేస్తున్న సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మెగా 157 సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సత్తా చాటుతున్నాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న చిరంజీవి సినిమాతో కూడా మరోసారి తన సక్సెస్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు అనిల్ రావిపూడి.
ఐతే ఈ సినిమాలో చిరు సరసన నయనతారని హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేసినా కూడా జస్ట్ సినిమాలు చేయడం వరకే తన పని ప్రమోషన్స్ లాంటివి తన వల్ల కాదన్నట్టుగా నయన్ ఉండేది. కానీ మెగా 157 ఆన్ బోర్డ్ అవుతూనే ఆమె తో అనిల్ చేయించిన ఒక చిన్న వీడియో అదిరిపోయింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమా ఛాన్స్ లు వస్తున్నా కుదరక చేయని నయనతార ఫైనల్ గా మెగా మూవీతో మళ్లీ ఇక్కడ రీ ఎంట్రీ ఇస్తుంది.
ఐతే మెగాస్టార్ చిరంజీవి 157 సినిమాలో నయనతార మాత్రమే ఉంటుందా మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంటుందా అన్న సందేహం మొదలైంది. అనిల్ రావిపూడి సినిమాల్లో సోలో హీరోయిన్స్ చాలా తక్కువ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలను తీసుకున్నారు. ఐతే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా మరో హీరోయిన్ ఉంటుందా అన్న చర్చ మొదలైంది.
ముఖ్యంగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ మెగా మూవీలో ఉంటే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. సినిమాలో ఏ చిన్న అవకాశం ఉన్నా డైరెక్టర్ మొదటి ఆప్షన్ గా ఆమెనే తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఐశ్వర్య రాజేష్ కూడా చిరంజీవితో సినిమా అంటే మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2026 సంక్రాంతికి రఫ్ఫాడించేందుకు రెడీ అవుతున్నారు అనిల్ రావిపూడి అండ్ టీం. మరి ఈ సినిమా అనుకున్న ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. తన న్యాచురల్ యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ మెప్పు పొందాలని చూస్తుంది ఐశ్వర్య రాజేష్. ఐతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అమ్మడు నెక్స్ట్ సినిమాలు కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.