తెలుగు సినిమా హీరో నిర్వచనాన్నే మార్చేసిన మెగాస్టార్!

చిరంజీవి సినిమాల్లో కథకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. దానికి సమానంగా పాటలు, డ్యాన్స్, కామెడీ, యాక్షన్, స్టైల్, ఎమోషన్ కూడా కీలకంగా మారాయి.

Update: 2026-08-22 09:40 GMT

తెలుగు సినీ హిస్ట‌రీలో ఎన్నో తరాల హీరోలు తమదైన ముద్ర వేశారు. అయితే ఒక నటుడి స్టార్‌డమ్‌ అనేది కేవలం అతడి సినిమాల స‌క్సెస్‌ల‌తోనే కొలవలేమని నిరూపించిన పేరు చిరంజీవి. ఆయ‌న స్క్రీన్ పై కనిపించే ప్రతిసారీ ఆడియ‌న్స్‌కు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్‌మెంట్ ను అందించే ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా తనను తాను మలచుకున్న ఆయన.. కాలక్రమంలో ఒక హీరో నుంచి పాప్ కల్చర్ ఐకాన్‌గా ఎదిగారు.

చిరంజీవి సినిమాల్లో కథకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. దానికి సమానంగా పాటలు, డ్యాన్స్, కామెడీ, యాక్షన్, స్టైల్, ఎమోషన్ కూడా కీలకంగా మారాయి. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తెలుగు కమర్షియల్ సినిమాపై చాలా లోతుగా కనిపించింది. సినిమాలో పాట వచ్చినప్పుడు కథను కాసేపు పక్కన పెట్టి థియేటర్ మొత్తం సెలబ్రేట్ చేసేలా చేయడం చిరంజీవి సినిమాల స్పెషాలిటీగా మారింది. ఆయన బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ, స్టెప్పులు ఆడియ‌న్స్ లో హీరో అంటే ఇలాగే ఉండాలనే కొత్త అంచనాలను సృష్టించాయి. ఆ తర్వాతి తరాల హీరోలపై కూడా ఈ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది.

అదే సమయంలో చిరంజీవి అంటే కేవలం డ్యాన్స్ చేసే హీరో అనే ఇమేజ్‌కు పరిమితం కాలేదు. మాస్ యాక్షన్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ మ్యానరిజమ్స్, కామెడీలో టైమింగ్, ఎమోషనల్ సీన్లలో యాక్టింగ్, స్క్రీన్‌పై స్పెష‌ల్ స్టైల్.. ఇవన్నీ కలిసే చిరంజీవి సినిమా అనే ప్రత్యేకమైన అనుభూతిని సృష్టించాయి. అందుకే ఆయన సినిమా రిలీజ్ అంటే అంటే ఒక సాధారణ రిలీజ్‌గా కాకుండా ఆడియ‌న్స్ కు ఒక ఈవెంట్‌గా మారిపోయేది.

ఇక్కడే చిరంజీవి అనే పేరు ఒక హీరో పేరు నుంచి ఒక బ్రాండ్‌గా మారిన పరిణామం కనిపిస్తుంది. సినిమా ఎలా ఉన్నా చిరంజీవి నుంచి ఏదో ఒక కొత్త అనుభూతి దొరుకుతుందనే నమ్మకం ఆడియ‌న్స్ లో ఏర్పడింది. ఒక స్టార్ పేరు సినిమా మార్కెట్‌కు బలంగా మారడం, ఆ పేరు వినగానే ఒక నిర్దిష్టమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియ‌న్స్ ఊహించుకోవడం.. ఇదే అసలు స్టార్‌డమ్‌కు చిరూ చెప్పిన నిర్వ‌చ‌నం.

మరోవైపు ఆయన ఇంపాక్ట్ సినిమా పరిధిని కూడా దాటి వెళ్లింది. ఫ్యాన్స్ అసోసియేష‌న్ క‌ల్చ‌ర్, సామాజిక సేవా కార్యక్రమాలు, ఫ్యాషన్, డ్యాన్స్, యూత్‌లో హీరోలపై ఏర్పడిన అభిప్రాయాలు.. ఇలా ఎన్నో అంశాల్లో చిరంజీవి ఇంపాక్ట్ కనిపించింది. అందుకే ఆయనను కేవలం స‌క్సెస్‌ఫుల్ యాక్ట‌ర్ గానే చూడటం సరిపోదు. తెలుగు కమర్షియల్ సినిమాకు ఒక కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్ములాను పరిచయం చేసి, దానిని ప్రజల జీవనశైలిలో భాగం చేసిన పాప్ కల్చర్ ఐకాన్ గా చిరంజీవి స్థానాన్ని చూడాల్సిందే.

Tags:    

Similar News