మెగాస్టార్ ఇచ్చిన ఆఫర్ నే రిజెక్ట్ చేసాడా?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా మాలీవుడ్ హిట్ చిత్రం `లూసీఫర్` ని తెలుగులో `గాడ్ ఫాదర్` టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా మాలీవుడ్ హిట్ చిత్రం `లూసీఫర్` ని తెలుగులో `గాడ్ ఫాదర్` టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. ఇందులో చిరంజీవి సరికొత్త పాత్రలో కనిపించినా? అంతగా కనెక్ట్ కాలేదీ చిత్రం. యావరేజ్ హిట్ గానే బాక్సాఫీస్ వద్ద రాణించింది. మాలీవుడ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఊహించని లాభాలు చూసారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో చిరంజీవి రీమేక్ కి పూనుకున్నారు. దర్శకుడి ఎంపిక విషయంలోనూ ఎన్నో ఆలోచనలు చేసారు.
ఈ కథను ఎవరైతే బాగా డీల్ చేస్తారని భావించి చాలా మంది దర్శకుల పేర్లను పరిశీలించి..చివరిగా తమిళ దర్శకుడు మోహన్ రాజాకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయన వరకూ ఎగ్జిక్యూషన్ లో ఎక్కడా వైఫల్యం కనిపించలేదు. కథే అంతగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. చిరంజీవి పాత్ర ఇంకా బలంగా ఉంటే బాగుండేది ? అన్న అభిప్రాయం మెజార్టీ వర్గం నుంచి వినిపించింది. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సిందిగా ముందు చిరంజీవి ఎవర్నీ అడిగారో? తెలిస్తే షాక్ అవుతారు.
అతడే యువ సంచలనం సుజిత్. అవును చిరంజీవి ముందుగా రీమేక్ ఛాన్స్ సుజిత్ కే ఇచ్చారట. కానీ సుజిత్ రీమేక్ సినిమాలు తాను చేయలేనని మరొకరికి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిందిగా చిరంజీవిని రిక్వెస్ట్ చేసాడు. దీంతో చిరంజీవి మోహన్ రాజాను తుదిగా ఎంపిక చేసారు. ఆ తర్వాత కొంత కాలానికి పవన్ కళ్యాణ్ నుంచి కూడా సుజిత్ కి రీమేక్ ఆఫర్ వచ్చింది. పవన్ కాల్ చేసి పిలవగా సుజిత్ వెళ్లి కలిసాడు. అవకాశం ఇస్తున్నా..ఈ కథను రీమేక్ చేయ్ అని సుజిత్ ని అడిగాడు పవన్ .
దీంతో సుజిత్ ఎగిరి గంతేయకుడా? చిరంజీవికి చెప్పిన సమాధానమే పవన్ కళ్యాణ్ కి చెప్పాడు. దీంతో పవన్ షాక్ అయ్యాడు. అప్పుడే సుజిత్ సొంత కథ రాసుకుని పవన్ దగ్గరకు వస్తానని..అప్పటి వరకూ వెయిట్ చేయండి ప్లీజ్ అంటూ వచ్చేసాడు. అలా వచ్చిన చిత్రమే నేడు రిలీజ్ అయిన `ఓజీ`. అలా అన్నదమ్ములిద్దరీకి నో చెప్పాడు ఈ యువ సంచలనం. మరి అన్నయ్యని రిజెక్ట్ చేసిన సుజిత్ అదే అన్నయ్య ముందుకు సొంత కథతో ఎప్పుడు వెళ్తాడో చూద్దాం.