చిరు గ్రేసు.. చరణ్ మాసు.. మెగా ఫ్యాన్స్ కి ఇంకేం కావాలి..!
ప్రస్తుతం 70 ఇయర్స్ ఏజ్ లో కూడా ఆ గ్రేస్ లో ఎక్కడ తగ్గకుండా డాన్స్ చేస్తున్నారు చిరంజీవి.;
టాలీవుడ్ లో నెంబర్ 1 డాన్సర్ అంటే చిరంజీవి తర్వాతే ఎవరైనా అనేస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ అని అంటున్నారు కానీ ఒకప్పుడు బ్రేక్ డాన్స్ అంటే చిరంజీవే.. సాధారణంగా ఏ హీరో సినిమా అయినా సాంగ్ వచ్చింది అంటే థియేటర్ నుంచి అలా బయటకు వెళ్లి దమ్ము కొట్టి వస్తారు. కానీ ఆ దమ్ము ఇచ్చే కిక్కు కన్నా చిరు చేసే స్టెప్పులే మెగా ఫ్యాన్స్ కి ఎక్కువ కిక్ ఇస్తాయి. అందుకే చిరంజీవి సినిమాల్లో సాంగ్స్ మాక్సిమం సూపర్ హిట్ అవుతాయి. ఇక ఆయన గ్రేస్ తో వేసే స్టెప్పులు మెగా ఫ్యాన్స్ ని మాత్రమే కాదు ఆబాల గోపాలాన్ని అలరిస్తాయి.
70 ఏజ్ లో కూడా ఆ గ్రేస్.
ప్రస్తుతం 70 ఇయర్స్ ఏజ్ లో కూడా ఆ గ్రేస్ లో ఎక్కడ తగ్గకుండా డాన్స్ చేస్తున్నారు చిరంజీవి. రీసెంట్ గా ఆయన నటిస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాలో మీసాల పిల్ల సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ లో చిరు గ్రేసీ స్టెప్పులు అదిరిపోయాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ సినిమాలోని మీసాల పిల్ల సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. సాంగ్ లో చిరు కూల్ స్టెప్స్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఎం.సి.జి సినిమా ఈ సాంగ్ తోనే ఒక క్రేజీ వైబ్ తీసుకొచ్చారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. చిరంజీవి సినిమాకు కంపోజ్ చేయడం లక్కీగా ఫీల్ అవుతున్నాడు భీమ్స్ . సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ పాట వినిపిస్తుంది. ఇక దీనితో పాటు గ్లోబల్ స్టార్ రాం చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ గా చికిరి రిలీజైంది.
చరణ్ మాస్ స్టెప్పులు, జాన్వీ కపూర్ అందాలు..
అకడమీ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. చిత్ర యూనిట్ డైరెక్ట్ గా వీడియో సాంగ్ నే రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. చరణ్ మాస్ స్టెప్పులు, జాన్వీ కపూర్ అందాలు అబ్బో చికిరి సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ముఖ్యంగా చరణ్ హుక్ స్టెప్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మొదలు పెట్టారు.
ఇటు చరణ్ చికిరి సాంగ్.. అటు చిరు మీసాల పిల్ల సాంగ్.. రెండు సినిమాల నుంచి రిలీజైన మొదటి సాంగ్స్ రెండు సూపర్ హిట్ అయ్యాయి. చిరు పాటని ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తుంటే.. చరణ్ చికిరి సాంగ్ ని యూత్ ఆడియన్స్ అంతా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఈ రెండు సినిమాల మధ్య రిలీజ్ రెండు నెలలు గ్యాప్ ఉంది. అయినా సరే మెగా ఫాదర్ అండ్ సన్ సాంగ్స్ తో మెగా ఫ్యాన్స్ కి ఒక ప్రత్యేకమైన జోష్ తెచ్చారు.
చిరంజీవి మన శంకర వరప్రసాద్.. చరణ్ పెద్ది..
మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా అనిల్ మార్క్ కామెడీతో పాటు చిరు కోసం మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడట. ఇక చరణ్ పెద్ది మాత్రం కథ, కథనం తో పాటు చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు.
ఈమధ్య స్టార్ సినిమాలు ఐనా కూడా సరైన పబ్లిసిటీ లేకపోతే షాకింగ్ రిజల్ట్స్ అందుకుంటున్నాయి. మన శంకర వరప్సాద్ ని ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలో అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు. ఇక చరణ్ పెద్ది కోసం బుచ్చి బాబు కూడా ప్రమోషనల్ ప్లాన్ కోసం గట్టి స్కెచ్ వేస్తున్నారట. రెండు సినిమాల మీద మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎలాగు రిలీజ్ కు రెండు నెలలు గ్యాప్ ఉంది కాబట్టి ఈ రెండు సినిమాలకు మెగా ఫ్యాన్స్ ఆదరించే ఛాన్స్ ఉంది.