మ‌ళ్లీ మెగాస్టార్ కోల్ క‌త్తా బ్యాక్ డ్రాప్!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 158వ సినిమా బాబి ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి.;

Update: 2025-11-16 19:30 GMT

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 158వ సినిమా బాబి ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. చిరంజీవి 157 నుంచి రిలీవ్ అవ్వ‌గానే ప‌ట్టాలె క్కించాల‌ని బాబి స‌ర్వం సిద్దం చేస్తున్నాడు. దాదాపు న‌టీన‌టుల ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌యింది. హీరోయిన్ విష యంలో డైల‌మా కొన‌సాగుతుంది. చిరంజీవి ఇమేజ్..వ‌య‌సు దృష్టిలో పెట్టుకుని ప‌ర్పెక్ట్ నాయిక‌గా కోసం సెర్చ్ చేస్తు న్నారు. మరికొన్ని రోజుల్లో హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది కూడా క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఈ నేప‌థ్యంలో బాబి ఎలాంటి బ్యాక్ డ్రాప్ తో క‌థ న‌డిపిస్తాడు? అన్న చ‌ర్చ మొద‌లైంది.

చిరు కెరీర్ లో అదో క్లాసిక్:

దీంతో ఆ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెలిసింది. ఈ బ్యాక్ డ్రాప్ చిరు-బాబి ఇద్ద‌ర‌కు క‌లిసి వ‌చ్చిందే. బాబి తొలి సినిమా  'పవ‌ర్' లో కొంత క‌థ బెంగాల్ నేప‌థ్యంలోనే సాగుతుంది. అక్క‌డ చిత్రీక‌రించిన యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. అలాగే చిరంజీవి హీరోగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'చూడాల‌ని ఉంది' కూడా ప‌శ్చిమ బెంగాల్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. అందులో చిరంజీవి పాత్ర‌ను ఎంతో అందంగా చూపించారు. ఆసినిమా అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించింది.

రెండు విజ‌యాల అనంత‌రం:

చిరు సినిమాల్లో అదో క్లాసిక్ చిత్రంగా చెప్పొచ్చు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ చిరంజీవి బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో చాలా కాలం పాటు సినిమాలు చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆ ఛాన్స్ మెహ‌ర్ ర‌మేష్ కి ఇచ్చాడు. అత‌డు చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన `భోళా శంక‌ర్` కూడా బెంగాల్ డ్రాప్ లోనే సాగుతుంది. కానీ ఈ సినిమా చిరు కెరీర్ లో ఓ డిజాస్ట‌ర్. మ‌ళ్లీ బాబి స‌హ‌కారంతో చిరంజీవి బెంగాల్ బ్యాక్ డ్రాప్ ని ట‌చ్ చేస్తున్నారు. ఈ కాంబినేష‌న్ పై అంచ‌నాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో తెరెక్కిన `వాల్తేరు వీర‌య్య` భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

బెంగాల్ లో మ‌రోసారి మెగాస్టార్:

ఇది వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగిన చిత్రం. క‌మ‌ర్శియ‌ల్ గా సినిమా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ న‌మ్మ‌కంతోనే చిరంజీవి బాబి అప్రోచ్ అవ్వ‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా 158 అత‌డితో లాక్ చేసారు. మ‌రి ఈ బెంగాల్ బ్యాక్ డ్రాప్ ను బాబి ఏ కోణంలో చూపిస్తాడు? ఎంత కొత్త‌గా ఆవిష్క‌రిస్తాడు? అన్న‌ది చూడాలి. చిరు ఇప్ప‌టికే స్లిమ్ లోకి మారిపోయారు. ఆయ‌న వ‌య‌సు ఏకంగా 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లిన‌ట్లు క‌నిపిస్తోంది. 157 తో పాటు 158 లో కూడా చిరు అదే లుక్ లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News