చిరిగిన చొక్కాతోనే తాళి కట్టిన మెగాస్టార్

చిరంజీవి పెళ్లి జరిగే రోజు ఆయన తాతయ్య ప్రేమలీలలు అనే సినిమాలో నటిస్తున్నారు. పెళ్లి రోజు సైతం ఆయన షూటింగ్ కు హాజరయ్యారు.;

Update: 2025-08-22 07:33 GMT

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. విజయవంతంగా 69ఏళ్లు పూర్తి చేసుకున్న చిరు.. నేడు 70వ పడిలోకి అడుగుపెట్టారు. 45ఏళ్లకుపైగా సినిమా కెరీర్, అనేక అవార్డులు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇండస్ట్రీలోనే మెగాస్టార్ గా , బిగ్ బాస్ గా ఎదిగారు. అయితే ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా చిరు జీవితంలో జరిగిన ఓ ఆసక్తి కర సంఘటన గురించి తెలుసుకుందాం.

అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవి 1980 ఫిబ్రవరి 20న పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్ళికి చిరు చిరిగిన చొక్కాతోనే పెళ్లి పీటలెక్కారని మీకు తెలుసా? అవును ఇది నిజం! ఆయన పెళ్లికి చిరు, చిరిగిన చొక్కాతో వెళ్లారట. మరి ఆయన అలా ఎందుకు వెళ్లారంటే..

చిరంజీవి పెళ్లి జరిగే రోజు ఆయన తాతయ్య ప్రేమలీలలు అనే సినిమాలో నటిస్తున్నారు. పెళ్లి రోజు సైతం ఆయన షూటింగ్ కు హాజరయ్యారు. అక్కడ్నుంచే నేరుగా పెళ్లి మండపానికి వచ్చారు. ఈ క్రమంలో డ్రెస్ మార్చుకునే సమయం లేకపోవడంతో మెగాస్టార్ అలాగే పెళ్లి పీటలెక్కారు. అలా చిరిగిన చొక్కాతోనే చిరంజీవి పీటలపై కూర్చున్నారు. ఈ సమయంలో అక్కడున్న వారు ఎవరో.. చొక్కా చిరిగింది. అని అన్నారు. దానికి రిప్లైగా చిరు.. ఏం చొక్కా చిరిగితే, తాళి కట్టనివ్వరా? అంటూ సరదాగా బదులిచ్చారు.

దీంతో మండపంలో నవ్వులు పూశాయట. ఈ విషయాన్ని చిరు తానే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా, ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు సురేఖ సొంత సొదరి అవుతారు. అలాగే అల్లు అర్జున్, శిరీశ్ సురేఖకు మేనల్లుళ్లు అవుతారు. దీంతో అప్పట్నుంచి అల్లు- మెగా ఫ్యామిలీల మధ్య బంధం మరింత బలపడింది. కాగా, ఇండస్ట్రీలో చిరు- సురేఖ జంట ఆదర్శ దంపతులుగా పేరుంది. ఫ్యామిలీలో ఏ ఈవెంట్ అయినా చిరు తన భార్య సురేఖతో కలిసి వెళ్తారు.

కాగా, చిరు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆయను విషెస్ చెప్పారు.

Tags:    

Similar News