చిరు-అనిల్‌ మూవీ... అక్టోబర్‌కే అంతా అయ్యేనా?

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.;

Update: 2025-06-23 14:30 GMT

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2026 సంక్రాంతికి సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. దర్శకుడు అనిల్ రావిపూడి ఏదైనా తేదీ అనుకుంటే ఆ తేదీకి వచ్చి తీరుతాడు. 2025 సంక్రాంతికి తన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను విడుదల చేయాలని పట్టుబట్టాడు. దిల్‌ రాజు పై ఒత్తిడి తెచ్చి మరీ అదే తేదీకి తీసుకు వచ్చాడు. ఆయన అనుకున్నాడు అంటే కచ్చితంగా ఆ తేదీకి తీసుకు వస్తాడు అనే టాక్‌ పడింది. అందుకే చిరంజీవితో చేస్తున్న సినిమాను 2026 సంక్రాంతికి తీసుకు వస్తాడా లేదా అనే అనుమానం లేనే లేదు. ఎందుకంటే సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

ఇటీవలే రెండో షెడ్యూల్‌ను ముస్సోరీలో పూర్తి చేసిన అనిల్‌ రావిపూడి మూడో షెడ్యూల్‌కి ఏర్పాట్లు పూర్తి చేశాడు. మూడో షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభంకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి వినిపిస్తుంది. మూడో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్‌ చేశారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతార పాల్గొనబోతున్నారు. వీరిద్దరితో పాటు వెంకటేష్ సైతం ఈ షెడ్యూల్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరు-అనిల్ రావిపూడి సినిమా కోసం వెంకటేష్ ఏకంగా మూడు నుంచి నాలుగు వారాల డేట్లు ఇచ్చాడని తెలుస్తోంది. ఒకే షెడ్యూల్‌లో వెంకటేష్ కి సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

దాదాపుగా నాలుగు వారాల డేట్లు వెంకటేష్‌ ఇచ్చాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కచ్చితంగా ఆయన పాత్ర తక్కువేం ఉండదని అనిపిస్తుంది. మూడో షెడ్యూల్‌ ను జులై చివరి వరకు చేసే అవకాశాలు ఉన్నాయి. మూడో షెడ్యూల్‌తో సినిమాకు సంబంధించిన కీలక టాకీ పార్ట్‌ పూర్తి అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అనిల్‌ రావిపూడి జోరు చూస్తూ ఉంటే ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్‌ వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. నవంబర్‌, డిసెంబర్‌ మొత్తం కూడా ప్రమోషన్‌కి సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కచ్చితంగా ప్రమోషన్ కంటెంట్‌ అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, తద్వార సినిమాను జనాల్లోకి ఎక్కువగా తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి ఈ ఏడాదిలో వశిష్ట దర్శకత్వంలో నటించిన విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ జరుగుతోంది. ఆ సినిమా ను విడుదల చేసిన వెంటనే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న కారణంగా ఇతర భాషల్లో విడుదల అయ్యేనా చూడాలి. చిరంజీవి వింటేజ్ లుక్‌తో పాటు, వింటేజ్‌ కామెడీని ఈ సినిమాలో చూస్తారు అంటూ అభిమానులకు అనిల్‌ రావిపూడి హామీ ఇస్తున్నాడు. మరి ఆయన అన్నట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది తెలియాలంటే 2026 సంక్రాంతి వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News