మెగాస్టార్ ను అలా చూసి ఎమోష‌న‌ల్ అయ్యా

మెగా157 ను మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్ గారు గా ఫిక్స్ చేసిన చిత్ర బృందం ఈ ఈవెంట్ లో సినిమా గురించి ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు.;

Update: 2025-08-22 21:30 GMT

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ మెగా157 టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ ఓ ఈవెంట్ నిర్వ‌హించ‌గా ఆ ఈవెంట్ కు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో పాటూ నిర్మాత‌లు సాహు గార‌పాటి, సుస్మిత కొణిదెల కూడా హాజ‌ర‌య్యారు. మెగా157 ను మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్ గారు గా ఫిక్స్ చేసిన చిత్ర బృందం ఈ ఈవెంట్ లో సినిమా గురించి ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు.

ఈ సినిమా కోసం తాను చెప్పిన వాట‌న్నింటికీ మెగాస్టార్ ఒప్పుకున్నార‌ని, అదే చాలా పెద్ద సంతోష‌మ‌ని, టైటిల్ విషయానికొస్తే హీరో ఒరిజిన‌ల్ పేరే క్యారెక్ట‌ర్ కు కూడా పెడితే బావుండ‌నిపించి దాన్నే పెట్టాన‌ని, అది అంద‌రికీ న‌చ్చ‌డం సంతోషంగా ఉంద‌ని చెప్పారు అనిల్ రావిపూడి. సినిమాలో మాస్ ఎంతుంటుంది? కాస్ల్ ఎంతుంటుంద‌నేది తాను చెప్ప‌లేన‌ని, తాను తీసిన సినిమా ఎక్కువమంది ఆడియ‌న్స్ కు రీచ్ అయ్యేలా ఉంటుంద‌ని మాత్రం చెప్ప‌గ‌ల‌న‌ని అనిల్ అన్నారు.

ఛాన్స్ ఉంటే ప్ర‌తీసారీ అలానే చేస్తా..

మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమాలో చిరంజీవి గ‌త సినిమాల్లోని కొన్ని మ్యాన‌రిజ‌మ్స్ ఉంటాయ‌ని చెప్పిన ఆయ‌న అవ‌కాశముంటే ప్ర‌తీసారీ త‌న సినిమాల టైటిల్స్ కు సంక్రాంతికి వ‌స్తున్నాం, పండ‌గ‌కు వ‌స్తున్నాం అనే పెడ‌తాన‌ని చెప్పారు. చిన్న‌ప్ప‌టి నుంచి బాల‌కృష్ణ‌, వెంకటేష్, చిరంజీవి సినిమాల‌ను చూస్తూ పెరిగిన త‌న‌కు ఇప్పుడు వారంద‌రినీ ఒక్కొక్క‌రిగా డైరెక్ట్ చేసే ఛాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, ఈ సినిమాలో మెగాస్టార్ ను మొద‌టిసారి మానిట‌ల్ లో చూసి ఎమోష‌న‌ల్ ఫీలైన‌ట్టు అనిల్ రావిపూడి వెల్ల‌డించారు.

స్వ‌యంగా చిరంజీవి గారే ఆ మాట చెప్పారు

ఈ సినిమాలో వెంక‌టేష్ గారు ఓ రోల్ చేస్తున్నార‌ని, టైటిల్ గ్లింప్స్ కు వాయిస్ కూడా ఆయ‌నే ఇచ్చార‌ని, త్వ‌ర‌లోనే సెట్స్ లో అడుగుపెట్ట‌బోతున్నార‌ని అనిల్ తెలిపారు. అయితే ఇప్పుడు చిరూ, వెంకీతో సినిమా చేస్తున్న‌ట్టే, ఫ్యూచ‌ర్ లో ఛాన్స్ వ‌స్తే బాల‌కృష్ణ‌- చిరంజీవితో సినిమా చేస్తారా అని అడగ్గా, కుదిరితే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని, త‌న జ‌ర్న వెంకీ- చిరూతో మొద‌లైంద‌ని, బాల‌కృష్ణ‌తో క‌లిసి వ‌ర్క్ చేసేందుకు రెడీగా ఉన్నాన‌ని గ‌తంలో చిరంజీవి గారే చెప్పార‌ని, వారిద్ద‌రూ క‌లిసి వ‌ర్క్ చేయాలంటే మంచి క‌థ సెట్ అవాల‌ని, అలాంటి క‌థ దొరికిన‌ప్పుడు చూద్దామ‌ని చెప్పారు.

మెగా157 విష‌యంలో అనిల్ కోరిక ఏంటంటే

సినీ కార్మికుల స‌మ్మె ప్ర‌భావం త‌మ సినిమాపై ఏ మాత్రం లేదని, దాని వ‌ల్ల త‌మ సినిమాకు సంబంధించిన ఏ షెడ్యూల్ కూడా ఆగింది లేద‌న్నారు అనిల్. ఈ సినిమా విష‌యంలో త‌న‌కొక కోరికుంద‌ని, ఓ వైపు చిరంజీవి, ఓ వైపు వెంక‌టేష్ ఉన్న‌ప్పుడు తాను మ‌ధ్య‌లో అలా క‌నిపించి ఇలా వెళ్తానని చెప్పారు. ఈ సినిమా కోసం త‌న తండ్రి ఎంతో క‌ష్ట‌ప‌డి లుక్స్ ను మార్చుకున్నార‌ని, ఆయ‌న ఇచ్చిన స్పూర్తితోనే ఆ లుక్ కు త‌గ్గ‌ట్టు కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేసిన‌ట్టు సుస్మిత తెలిపారు.

Tags:    

Similar News