మెగాస్టార్ ని సైతం అంద‌గాడివా అన్నారా?

నేడు బాలీవుడ్ లో ఆయ‌న రేంజ్ ఏంటి? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి ఇలాంటి విమ‌ర్శ‌లే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎదుర్కున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.;

Update: 2025-05-21 19:30 GMT

బిగ్ బీ అమితాబచ్చ‌న్ బాలీవుడ్ కి వ‌చ్చిన కొత్త‌లో ఎలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారో చెప్పాల్సిన ప‌ని లేదు. హీరోగా ప‌నికొచ్చే ఫేస్ కాదు..క‌టౌట్ కాదంటూ ఎంతో మంది విమ‌ర్శించారు. ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో అమితాబ్ ఓపెన్గా చెప్పిన సంద‌ర్భాలెన్నో. అయినా వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా క‌ష్టే ఫ‌లి అన్న‌దాన్ని న‌మ్మి స‌క్సెస్ అయ్యారు. స్టార్ అవ్వాలంటే అందంతో ప‌నిలేద‌ని ప్రూవ్ చేసారు.

నేడు బాలీవుడ్ లో ఆయ‌న రేంజ్ ఏంటి? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి ఇలాంటి విమ‌ర్శ‌లే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎదుర్కున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత వ‌ర‌కూ ఈ విష యాన్నిచిరంజీవి ఎక్క‌డా చెప్ప‌లేదు. తొలిసారి ఆయ‌న న‌టుడు అయ్యే క్ర‌మంలో ఎలాంటి విమ‌ర్శ‌లు స‌వాళ్లు ఎదుర్కు న్నారో ఓ కార్య‌క్ర‌మంలో రివీల్ చేసారు. డిగ్రీ అయింది. ఏం చేయాలో తెలియ‌దు. ఇంట్లో గైడెన్స్ కూడా లేదు.

కానీ నాకు న‌టుడు అవ్వాల‌ని ఉండేది. ఇదే విష‌యాన్ని ఇంట్లో చెప్పాను. వాళ్లు భ‌య‌పడుతూనే వ‌ద్దు అన్నారు. స‌క్సెస్ అయితే ప‌ర్వాలేదు. లేదంటే? ఎలా అని మ‌రో ప్ర‌శ్న కూడా వేసారు. దీంతో చెన్నై వ‌చ్చిన త‌ర్వాత ఫిలిం స్కూల్ తో పాటే ఐసీడ‌బ్యూ కోర్స్ కూడా చేసాను. ఒక‌వేళ న‌టుడు అవ్వ‌క‌పోతే కోర్సు ద్వారా నైనా జీవితంలో స్థిర‌ప‌డొచ్చ‌ని. కానీ నా మ‌న‌సు ఎంత‌కూ సినిమాలే కోరుకునేది.

దీంతో కోర్సు మానేసాను. నేను ఇండ‌స్ట్రీకి వెళ్తాన‌ని తెలిసి అంతా హేళ‌న చేసారు. సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఏమ నుకుంటున్నావ్? నీకు తెలిసిన వాళ్లు ఉన్నారా? నువ్వు వెళ్ల‌గానే పిలిచి అవ‌కాశిలిస్తారా? నువ్వు ఏమైనా పెద్ద అంద‌గాడివా? అని విమ‌ర్శించేవారు. ఒక్క‌రూ కూడా వెళ్లు అని ప్రోత్సహించింది లేదు` అన్నారు.

Tags:    

Similar News