మెగాస్టార్ నెక్స్ట్ టార్గెట్ 500 కోట్లే!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కిన `మన శంకర వరప్రసాద్ గారు` చిత్రంలో చిరు కామెడీ టైమింగ్ , మేనరిజమ్స్ ప్రేక్షకులను మెప్పించడంతో వసూళ్ల వర్షం కురిసింది.;

Update: 2026-03-24 05:15 GMT

సీనియ‌ర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి సరికొత్త రికార్డు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన `మన శంకర వరప్రసాద్ గారు` బాక్సాఫీస్ వద్ద ఏకంగా 400 కోట్ల వసూళ్లను రాబట్టి మెగా స్టామినాను మరోసారి చాటిచెప్పింది. దీంతో చిరంజీవి కెరీర్ లో ఇదే టాప్ గ్రాస‌ర్ గా నిలిచింది. ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో మెగాస్టార్ తదుపరి చిత్రాల లక్ష్యం 500 కోట్ల మార్కుగా ఫిక్స్ అయింది. వయసుతో సంబంధం లేకుండా యువ హీరోలకు పోటీనిస్తూ చిరంజీవి చేస్తున్న ప్రయోగాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుం టున్నాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కిన `మన శంకర వరప్రసాద్ గారు` చిత్రంలో చిరు కామెడీ టైమింగ్ , మేనరిజమ్స్ ప్రేక్షకులను మెప్పించడంతో వసూళ్ల వర్షం కురిసింది. 400 కోట్ల క్లబ్‌లో చేరడం అనేది ఒక సీనియర్ హీరోకు సామాన్యమైన విషయం కాదు. మెగాస్టార్ మాత్రం ఇక్కడితో ఆగ‌రు. రాబోయే చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలపైనా అన్న‌య్య గురి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో అందరి దృష్టి చిరంజీవి నటిస్తోన్న‌ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ `విశ్వంభర` పైనే ఉంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న‌ ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమాగా ఇప్ప‌టికే హైలైట్ అవుతోంది.

`బింబిసార` ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అత్యున్నత స్థాయిలో విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకున్న క్రేజ్, మేకింగ్ వాల్యూస్ చూస్తుంటే? ఇది ఈజీగా 500 కోట్ల మార్కును అందు కుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం `విశ్వంభర` గ్రాఫిక్స్ పనుల కారణంగా కొంత ఆలస్యమైనా? జులై 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జులై 24వ తేదీకి మెగాస్టార్ కెరీర్‌లో `ఇంద్ర` రిలీజ్ సెంటిమెంట్ ఉండటంతో అదే రోజున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంతో పాటు చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల , బాబీ కొల్లిల కాంబినేషన్‌లో రాబోయే సినిమాలు కూడా వంద‌ల కోట్లవ వ‌సూళ్ల‌ టార్గెట్‌తోనే సెట్స్ పైకి వెళ్తున్నాయి. మొత్తానికి మెగాస్టార్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బాక్సాఫీస్ చక్రవర్తిగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు. 400 కోట్ల రికార్డుతో మొదలైన ఈ ప్రస్థానం `విశ్వంభర`తో 500 కోట్ల మైలు రాయిని చేరుకుంటుందా ? లేదా? అన్నది చూడాలి. త్వ‌ర‌లోనే బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రం రెగ్య‌లర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈ సినిమా తో పాటు శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ను కూడా ప‌ట్టాలెక్కించాల‌ని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News