157 లో మెగాస్టార్ శివ శంకర వర ప్రసాద్!
మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. జూన్ నుంచి ప్లాన్ చేసుకున్నా? అనూహ్యంగా దర్శకుడు అనీల్ రావిపూడి శుక్రవారం నుంచే పట్టాలెక్కించారు.;
మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. జూన్ నుంచి ప్లాన్ చేసుకున్నా? అనూహ్యంగా దర్శకుడు అనీల్ రావిపూడి శుక్రవారం నుంచే పట్టాలెక్కించారు. చిరంజీవితో పాటు ప్రధాన తారగణమంతా తొలి షెడ్యూల్ తొలి రోజు షూటింగ్ లో పాల్గొన్నారు. వాళ్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పటికే చిరంజీవి పాత్ర ఎలా ఉంటుందన్నది ముందే రివీల్ చేసారు. ఈ సినిమాలో చిరు మరో 'చంటబ్బాయి'లా హైలైట్ అవుతారని వినిపిస్తుంది.
హిలేరియస్ ఎంటర్ టైనర్ లో చిరు పాత్ర చాలా కామిక్ గా ఉంటుందని ముందే రివీల్ చేసారు. చిరంజీవి చాలా కాలం తర్వాత ఎంతో ఇష్టపడి చేస్తోన్న కామెడీ చిత్రమిది. తాజాగా చిరు పాత్రకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఇందులో చిరంజీవి పాత్ర పేరు శివ శంకర వర ప్రసాద్ అట. ఈ పేరు ఇప్పటి జనరేషన్ చాలా మందికి తెలియదు. చిరంజీవి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్.
స్టార్ కాక ముందు ఇదే పేరుతో పిలవబడే వారు. స్టార్ అయిన తర్వాత స్క్రీన్ నేమ్ చిరంజీవి అయింది. అక్కడ నుంచి పెద్ద స్టార్ అవ్వడంతో మెగాస్టార్ అనే బిరుదు దక్కిం చుకున్నారు. అలా శివ శంకర వర ప్రసాద్ పరిశ్రమలో చిరంజీవిగా, మెగాస్టార్ గా ఎదిగారు. 157లో శివ శంకర వర ప్రసాద్ వాస్తవ పేరునే పెట్టే సాహసం అనీల్ చేసాడంటే? దాని వెనుక బలమైన రీజన్ ఉంటుంది.
కెమెరా వెనుక చిరంజీవి ఎలా ఉంటారు? అన్నది పాత్రలో జోడించి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. చిరంజీవి రియల్ క్యారక్టరైజేషన్ కూడా ఇందులో ఉంటుందంటున్నారు. చిరంజీవి నుంచి అనుమతి వచ్చాకే ఆయన వాస్తవ పేరు పాత్రకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా టైటిల్ పై ఆసక్తి నెలకోంది. అనీల్ సినిమా టైటిల్స్ కూడా క్యాచీగా ఉంటాయి. స్టోరీనే బట్టే టైటిల్ పెడుతుంటాడు.